జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం రాజారాలో భూ వివాదం కారణంగా తల్లిదండ్రులపై కొడుకు నరేశ్ దాడి చేశాడు. దాడిలో తండ్రి నాగరాజు, తల్లి నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. దంపతులను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TG Crime: తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిదండ్రులపై కొడుకు విచక్షణరహితంగా దాడి చేశాడు. అమ్మనాన్న అని కూడా కనీసం కనికరం లేకుండా కొడవలి, గడ్డపారతో దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం రాజారాం గ్రామంలో జరిగింది. ఈ దాడికి ప్రధాన కారణం భూ వివాదం అని తెలుస్తోంది. దీని కారణంగానే తల్లిదండ్రులపై కొడుకు నరేశ్ దాడి చేశాడు.
ఈ దాడిలో తండ్రి నాగరాజు, తల్లి నాగమణికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన దంపతులను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై వివరాలు అడగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also read
- నువ్వు చాలా అందంగా ఉన్నావు…. తక్కువ వయస్సులా కనిపిస్తున్నావు..
- మాజీ ప్రియురాలిపై రౌడీ షీటర్ లడ్డూ దాడి
- బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
- హనుమంతుడి ఆశీస్సుల కోసం హనుమంతుడి జయంతి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా..
- Lucky Zodiac Signs: చంద్ర మంగళ యోగం.. ఆ రాశుల వారికి అధికారం, ఆదాయం పక్కా..!