ఏనాడో మనిషి ఆలోచనలు, నడవడికను అంచనా వేసి మానవ సంబంధాలన్నీ ఆర్ధిక బంధాలే అని చెప్పారు కార్ల్ మార్క్స్. ఈ మాట అనేక విషయాల్లో రుజువు అవుతూ ఉంది కూడా.. ఆస్తులు, డబ్బులు వంటివి మానవ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తూ రక్త సంబంధాన్ని సైతం పలుచన చేస్తోంది. తాజాగా ఇద్దరు అన్న దమ్ముల మధ్య ఏర్పడిన భూ తగాదా ఏకంగా హత్య ప్రయత్నం వరకూ వెళ్ళింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు సోదరుల మధ్య భూ వివాదం సినిమాను తలపిస్తూ జరిగిన భయానక సంఘటనలో ఒక సోదరుడు ట్రాక్టర్‌ను నడుపుతూ మరొక సోదరుడిపైకి ఎక్కించే ప్రయత్నం చేసినట్లు ఆరోపించడంతో ఘోరమైన మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమై వైరల్ అవుతోంది.
నివేదికల ప్రకారం తివాయా గ్రామంలో ఇద్దరు సోదరుల మధ్య భూమి కోసం తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం భౌతికంగా దాడులు చేసుకునే వరకూ వెల్లడింది. దీంతో సోదరులిద్దరూ ఒకరి కుటుంబాలపై మరొకరు దాడికి పాల్పడ్డారు.
వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజీలో ఫోన్‌లో నడుచుకుంటూ వెళుతున్న బాధితుడిని అకస్మాత్తుగా అతని సోదరుడు ట్రాక్టర్ చక్రాల కింద పడే టట్లు ఢీకొట్టడంతో పరిస్థితి భయంకరమైన మలుపు తిరిగింది. అయితే అద్భుతంగా బాధితుడు దాడి నుండి బయటపడ్డాడు. వీడియో చివరలో అతను ట్రాక్టర్ కింద నుంచి బయట పడి సంఘటన స్థలం నుండి దూరంగా కుంటుతూ వెళ్లి పోతుండడం కనిపించింది. నివేదికల ప్రకారం గొడవ సమయంలో సోదరుడు తన తోబుట్టువు భార్యపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది.
సంఘటనకు సంబంధించిన ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్నదమ్ముల మధ్య వాగ్వాదం , హత్యాయత్నానికి సంబంధించిన పరిస్థితులను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం