SGSTV NEWS
Astro TipsAstrologySpiritual

Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!

 

ప్రస్తుతం శుక్ర, బుధుల మధ్య పరివర్తన జరిగినందువల్ల కొన్ని రాశుల వారు అనేక విషయాల్లో జాక్ పాట్ కొట్టే అవకాశం ఉంది. ఏ ప్రయత్నమైనా విజయవంతం కావడంతో పాటు, వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. కన్యా రాశిలో ఉన్న శుక్రుడికి, తులా రాశిలో ఉన్న బుధుడికి మధ్య పరివర్తన జరగడం చాలా మంచిది. కొన్ని రాశుల వారి జీవితాలు గణనీయంగా మారి పోయే అవకాశం ఉంది. అక్టోబర్ నెలాఖరు వరకూ ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది. శృంగార జీవితానికి, భోగ భాగ్యాలకు కారకుడైన శుక్రుడికి బుధుడితో పరివర్తన జరగడం వల్ల తప్పకుండా ధన ప్రవాహం ఉంటుంది. ఇవన్నీ మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకర రాశుల జీవితాల్లో చోటు చేసుకుంటాయి.

మేషం: ఈ రాశికి శుక్ర, బుధుల పరివర్తన వల్ల ధనానికి లోటుండని జీవితం ఏర్పడుతుంది. సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి. శృంగార జీవితంలో కొత్త పుంతలు తొక్కుతుంది. భోగభాగ్యాల్లో జీవి స్తారు. విలాస జీవితానికి అలవాటుపడతారు. విహార యాత్రలు ఎక్కువగా చేస్తారు. శుభ కార్యాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. దాంపత్య జీవితం మరింత పటిష్ఠం అవుతుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు నెరవేరే అవకాశముంది.

వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు బుధుడితో పరివర్తన చెందడం వల్ల, బుధుడిని గురువు వీక్షించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పట్టపగ్గాలుండవు. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. భోగ భాగ్యాలు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉన్నత స్థాయి సమాజంలో చేరిపోయే సూచనలున్నాయి. విదేశాలకు వెళ్లడం లేదా ఎక్కువగా విహార యాత్రలు చేయడం వంటివి జరుగుతాయి.

కర్కాటకం: ఈ రాశికి బుధ, శుక్రుల పరివర్తన తప్పకుండా రాజయోగాలను, ధన యోగాలను కలిగిస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. విలాసాల్లో మునిగి తేలుతారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. జీవనశైలి సమూలంగా మారిపోతుంది.

సింహం: ఈ రాశికి ధన స్థానంలో శుక్ర, బుధుల పరివర్తన వల్ల ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు ఆస్కారముంటుంది. ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపవుతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఉద్యోగం లభించే అవకాశం ఉంది. హోదా, భారీ జీత భత్యాలకు అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారే సూచనలున్నాయి. విదేశీ అవకాశాలు లభిస్తాయి.

కన్య: ఈ రాశిలో ఉన్న శుక్రుడికి, ధన స్థానంలో ఉన్న రాశ్యధిపతి బుధుడికి పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా ఉంది. లక్ష్మీ కటాక్షం బాగా ఎక్కువగా ఉన్నందువల్ల భోగభాగ్యాలకు, విలాస జీవితానికి, సుఖ సంతోషాలకు లోటుండదు. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. విదేశీయానానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.

వృశ్చికం: ఈ రాశికి దశమ, లాభ స్థానాల్లో శుక్ర, బుధుల పరివర్తన చోటు చేసుకోవడం వల్ల ఉద్యోగంలో ఈ రాశివారి ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది. జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. అవసరానికి మించిన డబ్బు చేతిలో ఉంటుంది. విలాస జీవితాన్ని అనుభవించడంలో వీరు కొత్త పుంతలు తొక్కుతారు. బాగా ఆస్తి కలిసి వస్తుంది.

మకరం: ఈ రాశికి నవమ, దశమ స్థానాల్లో బుధ, శుక్రుల మధ్య పరివర్తన జరగడం తప్పకుండా మహా భాగ్య యోగాన్ని కలగజేస్తుంది. అనేక మార్గాల్లో అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. శృంగార జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. జీవితం విలాసవంతంగా మారిపోతుంది. భోగ భాగ్యాలకు లోటుండదు. సామాన్యుడు కూడా ఆర్థికంగా బలం పుంజుకోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.

Also read

Related posts