శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరికి లక్ష మల్లెల అర్చన. శోభాయమానంగా చందనాలంకారం.
ఒంగోలు::
ఒంగోలు గాంధీరోడ్డు, కన్యకా పరమేశ్వరి అమ్మవారి వీధిలో కొలువైయున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కి జయంతి నగరోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు శుక్రవారం ఉదయం 7 గంటలకు అమ్మవారికి దదియతో అభిషేకం నిర్వహించారు. తదుపరి అలంకారం, పూజ, మంత్రపుష్పం శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు నిర్వహించారు.




సాయంత్రం జరిగిన ఉత్సవాల్లో అమ్మవారు చందనాలంకార భూషితంగా భక్తులను అనుగ్రహించారు. పురోహితులు సామూహికంగా లలితా సహస్రనామార్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు మల్లెపూలను చేతబట్టి స్థానిక గాంధీ రోడ్డు, దక్షిణం బజారు, ఏను చెట్టు వీధి, పప్పు బజార్ మీదుగా ఊరేగింపుగా ఆలయమునకు విచ్చేశారు. అనంతరం స్థానిక వాసవి క్లబ్స్ సంయుక్తంగా అమ్మవారికి లక్షమల్లెలార్చన పూజను ఘనంగా నిర్వహించారు. రాత్రికి జరిగిన గుడి ఉత్సవంలో వాసవి కోలాట భజన మండలి వారిచే కోలాటం, రథంపై అమ్మవారిని ఊరేగించారు. ఆలయ తదియారాధన సంఘం సభ్యులు కార్యనిర్వహణ చేశారు.
Also read
- ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
- నేటి జాతకములు….25 అక్టోబర్, 2025
- Telangana: 45 ఏళ్ల మహిళతో పరాయి వ్యక్తి గుట్టుగా యవ్వారం.. సీన్లోకి కొడుకుల ఎంట్రీ.. కట్ చేస్తే
- ఉపాధి కోసం కువైట్ వెళ్తానన్న భార్య.. వద్దన్న భర్త ఏం చేశాడో తెలుసా?
- Telangana: వారికి జీతాలు ఇచ్చి ఆ పాడు పని చేపిస్తున్నారు.. పొలీసులే నివ్వెరపోయిన కేసు ఇది..




