అనాథాశ్రమానికి చందా ఇవ్వాలంటూ వచ్చిన ఓ ఇద్దరు అమ్మాయిలు వృద్ధురాలి మెడలోంచి ఏడు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లిలో చోటుచేసుకుంది. తర్వాత ఇంటి బయట గడియ పెట్టి పారిపోయారు.
అనాథాశ్రమానికి చందా ఇవ్వాలంటూ వచ్చిన ఓ ఇద్దరు అమ్మాయిలు వృద్ధురాలి మెడలోంచి ఏడు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లిలో చోటుచేసుకుంది. గజ్జెల్లి లక్ష్మి అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉంటోందని గమనించిన ఓ ఇద్దరు అమ్మాయిలు లక్ష్మి వద్దకు వచ్చి అనాథాశ్రమానికి చందా ఇవ్వాలని, వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చామంటూ ఆధార్ కార్డు చూపించాలని కోరారు.
ఈ క్రమంలో ఎవరూ లేని టైమ్ చూసి ఇంట్లోకి చొరబడి లక్ష్మి చేతులు, నోరు గట్టిగా పట్టుకొని ఆమె మెడలో ఉన్న ఏడు తులాల బంగారు గొలుసును లాక్కున్నారు. తర్వాత ఇంటి బయట గడియ పెట్టి పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత వృద్ధురాలి ఏడుపు విన్నచుట్టుపక్కల వాళ్లు గడియ తీసి విషయం తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై నవీన్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- BJP Leader love case: నవ వధువును ఎత్తుకెళ్లిన బీజేపీ నేత.. చెప్పుల దండేసి ఊరేగించిన స్థానికులు!
- AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా..
- AP News: గురుకులంలో 12 మంది విద్యార్థులకు అస్వస్థత
- Dog bite: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్లో ఏరులై పారిన నెత్తురు!
- Online Betting: ఆన్లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్కు ఫోరెన్సిక్ పరీక్ష!