43రోజులుగా చంచల్‌గూడ జైలులోనే ఉన్న అఘోరీని మీడియా బృందం కలిసింది. అక్కడ అఘోరీ శ్రీవర్షిణి కోసం కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె బాగోగులు అడిగి తెలుసుకుంది. శ్రీవర్షిణి కనిపిస్తే అడిగానని చెప్పాలని తెలిపింది. బెయిల్ ఇప్పించే స్తోమత తన తల్లిదండ్రులకు లేదని ఏడ్చింది.
గత ఏడాది నుంచి లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సనాతన ధర్మం అంటూ.. మహిళలపై జరుగుతున్న అఘోయిత్యాల కోసం తాను పోరాడుతానని ఏపీ, తెలంగాణలో తెగ తిరిగేశాడు. ఆ సమయంలో పలువురితో గొడవలకు దిగాడు. అక్కడితో ఆగకుండా పోలీస్ అధికారులపై సైతం దాడులు చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి.
ఇక ఎప్పుడైతే వర్షిణీతో ప్రేమలో పడ్డాడో అప్పటి నుంచి అఘోరీ జీవితం పూర్తిగా మారిపోయింది. వర్షిణీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలోనే మరో మహిళ అతడిపై కేసు వేసింది. తానే మొదటి భార్యనని రాధిక అనే మహిళ మీడియా ముందుకు రావడం సంచలనం రేపింది. అది మాత్రమే కాకుండా ఓ సినిమా ప్రొడ్యూసర్ సైతం అఘోరీపై కేసు వేసింది.
43 రోజులుగా జైలులోనే
పూజలు పేరుతో తనను బెదిరించి రూ.10 లక్షలు తీసుకున్నాడని కేసు వేయడంతో పోలీసులు అఘోరీని అరెస్టు చేశారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైల్లోనే ఉంచారు. ఇటీవలే మోకిలా, కొమురవెళ్లి కేసుల్లో అఘోరీకి బెయిల్ వచ్చింది. కానీ తన మొదటి భార్య రాధిక పెట్టిన కేసులో ఇంకా బెయిల్ రాలేదు. దీంతో జైల్లోనే ఉంచారు. ఇలా అఘోరీ దాదాపు 43 రోజులుగా చంచల్‌గూడ జైలులోనే ఉంది.
తాజాగా చంచల్‌గూడ జైల్లో ఉన్న అఘోరీ అలియాస్ శ్రీనివాస్‌ను ప్రముఖ మీడియా బృందం కలిసింది.
శ్రీ వర్షిణి కనిపిస్తే
అక్కడ అఘోరీ శ్రీ వర్షిణి కోసం కన్నీళ్లు పెట్టుకుంది. అంతేకాకుండా శ్రీవర్షిణి బాగోగులు అడిగి తెలుసుకుంది. శ్రీ వర్షిణి కనిపిస్తే అడిగానని చెప్పాలని తెలిపింది. బెయిల్ ఇప్పించే స్తోమత తన తల్లిదండ్రులకు లేదు అని అఘోరీ కన్నీళ్లు పెట్టుకుంది. తన అమ్మానాన్నలకు తాను ఏం చేయలేకపోయాను అని ఆవేదన చెందింది. శివయ్య, కాళీమాతను నమ్ముకున్నానని.. అంతా ఆ పైవాడికే వదిలేస్తున్నానని తెలిపింది. ఒకవేళ తనకు బెయిల్ ఇప్పించాలంటే తన తల్లిదండ్రుల జీవనాధారమైన ఆవులను అమ్ముకోవాలి అని పేర్కొంది. అందుకే తాను వాళ్లను ఇబ్బంది పెట్టడం లేదని తెలిపింది. సనాతన ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధం అని చెప్పింది.
Also read
- నేటి జాతకములు..15 అక్టోబర్, 2025
- Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?
- Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..
- TG News: తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!