లేడీ అఘోరీ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఏపీలోని తణుకుకు వెళ్లే క్రమంలో మీడియా మాట్లాడారు. రాజేష్ నాథ్ అనే అఘోరపై ఆరోపణలు చేశారు. మంచి చేస్తానని చెప్పి మహిళలను వేధిస్తున్నాడని.. అతడి వద్ద లైసెన్స్ లేని 10 గన్‌లు ఉన్నాయని చెప్పారు.
ఇటీవల కాలంలో లేడీ అఘోరి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దాదాపు నెల రోజులకు పైగా అఘోరీ ఎపిసోడ్ నడిచింది. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ తల్లి టెంపుల్ వద్ద ఆమె చేసిన రచ్చతో వైరల్‌గా మారిపోయింది. అక్కడ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆలయాలను సందర్శించే క్రమంలో ఎన్నో సమస్యలను ఎదురయ్యాయి.
ఏపీకి అఘోరీ
దేవాలయాలపై దాడులను ఆపుతానని.. దానికోసం తాను ఆత్మార్పణ చేసుకుంటానని పలుమార్లు ప్రయత్నం చేసింది. పోలీసులు సైతం అఘోరీని పట్టుకోవడం.. అక్కడ నుంచి రాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టడం చేశారు. అయితే ఇలా నెల రోజులు దాటిన తర్వాత అఘోరీ కుంభమేళాలో బిజీ అయిపోయింది. మళ్లీ ఇప్పుడు ఏపీలో దర్శనమిచ్చింది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు ప్రాంతానికి బయలుదేరింది.
ఈ క్రమంలో మీడియా తో మాట్లాడింది. తాను తనుకు వెళ్లడానికి గల కారణాలను వెల్లడింది. ఈ మేరకు అఘోరీ మాట్లాడుతూ.. రాజేష్ నాథ్ అనే అఘోరా మంచి చేస్తానని చెప్పి ప్రజల దగ్గర డబ్బులు వసూళు చేస్తున్నాడని లేడీ అఘోరీ ఆరోపించింది. అంతేకాకుండా అఘోరా ముసుగులో అతడు అమ్మాలయిలను ట్రాప్ చేస్తున్నాడని.. అసభ్యకరమైన మెసేజ్‌లు చేస్తూ వాళ్లను వాడుకుంటున్నాడని.. వాటికి సంబంధించిన చాటింగ్, వీడియోలు తన వద్ద ఉన్నాయని అఘోరీ తెలిపింది. అందుకే అతడి వద్దకు వెళ్తున్నానని చెప్పుకొచ్చింది.
రాజేష్ నాథ్ అనే వ్యక్తి అఘోరాగా చెప్పుకుంటూ ఆడపిల్లలను వేధిస్తున్నట్లు తనకు కంప్లైంట్‌లు వచ్చాయని అందుకే బయల్దేరి అతడిని ప్రశ్నించడానికి వెళ్తున్నానని అఘోరీ పేర్కొంది. అంతేకాకుండా రాజేష్ నాథ్ దగ్గర లైసెన్స్ లేని 10 గన్‌లు ఉన్నాయని తెలిపింది. ముందు తనుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని.. అప్పటికి వినకపోతే వాడిని బతకనియ్యను అని పేర్కొంది. ఈ క్రమంలోనే రాజేష్ నాథ్ పై ఫిర్యాదు చేసేందుకు తణుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే అఘోరాపై ఫిర్యాదును పోలీసులు స్వీకరించకపోవడంతో అఘోరీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో పోలీసుల ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Also read
- Telangana: దారుణం.. భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
- Durgs : శంషాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
- TG Crime: తెలంగాణలో మరో దారుణం.. తల్లిని చంపిన కూతురు!
- Crime News: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్మెయిల్ చేస్తూ.. చివరికి!
- Ranya Rao: కస్టడీలో నన్ను లైంగికంగా వేధిస్తున్నారు..! రన్యా రావు సంచలన స్టేట్మెంట్