April 16, 2025
SGSTV NEWS
Andhra Pradesh

నవరత్నాల” పేరిట కార్మిక సంక్షేమ మండలి నిర్వీర్యం తగదు….. గ్రీష్మ కుమార్,

“నవరత్నాల” పేరిట కార్మిక సంక్షేమ మండలి నిర్వీర్యం తగదు….. గ్రీష్మ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి. ఐ.యఫ్.టి.యు.
        నిడదవోలు మండలం కోరుపల్లి లో ఐ.యఫ్.టి.యు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు నిలుపుదల కు నిరసన గా ఆందోళన నిర్వహించారు.
       ఈ సందర్భంగా యూనియన్ సెక్రటరీ కోమలి వర ప్రసాద్, ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ లు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం దశాబ్దాలుగా అమలులో ఉన్న వివిధ ఆర్థిక పరిహారాలు నిలుపుదల చేసిన ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల కు ద్రోహం చేసిందన్నారు.
      ఐ.యఫ్.టి‌యు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ 1996 నుండి కేంద్రం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల లోను , 2008 నుండి ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఆంధ్రప్రదేశ్ “భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి” (ఎ.పి.బి.ఓ.సి) ద్వారా పార్టీలకతీతంగా రాజశేఖరరెడ్డి , రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తదితరులు అమలు చేసిన వివిధ ఆర్థిక పరిహారాలను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ “నవరత్నాల” అమలు పేరిట భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ని నిర్వీర్యం చేసిందన్నారు. కార్మిక సంక్షేమ మండలి నిధుల దుర్వినియోగానికి పాల్పడడమేకాక , తమ పాలనా కాలం ముగుస్తున్న ప్పటికినీ తక్షణమే  సదరు నిధులు సంక్షేమ బోర్డు కు”జమ” చేయాలన్న కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించారనీ, తక్షణమే కోర్టు ఆదేశాలను పాటించి, పెండింగ్ లో ఉన్న పరిహారాలు విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.
         పై కార్యక్రమంలో యూనియన్ నాయకులు కట్టా దుర్గా ప్రసాద్, మిద్దె వెంకన్న, ఊబా మహేష్, బొల్లా శివ నాగు, కళ్ళెం చిన్నారి, బోర్లా వెంకన్న, దువ్వాపు వెంకటేష్ పాల్గొన్నారు.

Also read

Related posts

Share via