April 18, 2025
SGSTV NEWS
Astrology

వారంరోజుల్లో పరివర్తన యోగంతో ఈ రాశులవారికి కుబేరయోగం!

గురు శుక్ర గ్రహాలు నవంబర్ మాసంలో ఒక ముఖ్యమైన యోగాన్ని ఏర్పరచనున్నాయి. గురువు శుక్రుడు మధ్య నవంబర్ మాసంలో పరివర్తన జరగడం కారణంగా పరివర్తన యోగం ఏర్పడుతుంది. గురు గ్రహానికి చెందిన ధనుస్సు రాశిలో శుక్రుడి ప్రవేశం, శుక్ర గ్రహానికి చెందిన వృషభ రాశిలో గురుని ప్రవేశం కారణంగా పరివర్తన యోగం ఏర్పడింది.

పరివర్తన యోగం
నవంబర్ 7వ తేదీ నుంచి డిసెంబర్ రెండవ తేదీ వరకు ఈ పరివర్తన యోగం కొనసాగుతుంది ఈ కారణంగా వారికి శుభాలు జరుగుతాయి ఒక సమయంలో కచ్చితంగా మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ధనయోగం పట్టనుంది ఆ రాశులను గురించి తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి ధన మరియు భాగ్య స్థానాల అధిపతుల మధ్య పరివర్తన జరగడం వలన అపారమైన ధనలాభం కలుగుతుంది. మేష రాశి జాతకులకు ఈ సమయంలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగాలు చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. పెట్టిన పెట్టుబడులు లాభాలు ఇస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు పరిష్కారమై అనుకూలతలు పెరుగుతాయి.

సింహరాశి
సింహరాశిలో పంచమ, దశమ స్థానాల అధిపతుల మధ్య పరివర్తన జరగడం కారణంగా సింహ రాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగం చేసేవారు సానుకూల ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు ఆశించిన మేర ఉద్యోగాల ఆఫర్లు అందుతాయి. వృత్తి వ్యాపారాలు చేసేవారు లాభాలను చూస్తారు. శుభవార్తలు వింటారు.

కన్యారాశి
కన్యారాశిలో చతుర్ధ మరియు భాగ్య స్థానాల అధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల వీరికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. సొంతింటి కల నెరవేరుతుంది. వాహనయోగం, ఆస్తి యోగం ఉంది. విదేశాలకు వెళ్లే అవకాశాన్ని పొందుతారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో ఆర్థికంగాను బలోపేతం అవుతారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ధన మరియు సప్తమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగాలు చేసే వారికి వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆస్తులకు సంబంధించి వివాదాలు పరిష్కారమవుతాయి.

కుంభరాశి
కుంభరాశి వారికి చతుర్ధ మరియు లాభ స్థానాల అధిపతుల మధ్య పరివర్తన జరగడం కారణంగా కుంభరాశి వారికి ఇబ్బడి ముబ్బడిగా ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో వీరికి స్థిరాస్తులు, చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మీన రాశి
తృతీయ స్థానంలో ఉన్న రాశి అధిపతి భాగ్య స్థానంలో ఉన్న రాశి అధిపతి తో పరివర్తన జరగడం వల్ల మీన రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగంలో ఊహించని మార్పులు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇది మీన రాశి వారికి శుభ సమయం





Related posts

Share via