July 3, 2024
SGSTV NEWS
Andhra Pradesh

వృద్ధ దంపతుల ప్రాణాలు కాపాడిన  కృష్ణా జిల్లా పోలీస్

కృష్ణాజిల్లా

*కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ గారి ప్రత్యేక చొరవతో ఆ దంపతులను కుమారుని చెంతకు చర్చిన వీరవల్లి పోలీసులు*

*ఆర్థిక, కుటుంబ స్వల్ప వివాదాలే ఆత్మహత్య ప్రేరేపనకు కారణం*

కుటుంబంలో నెలకొన్న చిన్నచిన్న వివాదాలు ఆర్థికపరమైన నిభేదాల కారణంగా నరసాపురానికి చెందిన వృద్ధ దంపతులు ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా బయటికి వచ్చేసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా అర్ధరాత్రి సమయంలో ఆ వృద్ధ దంపతుల కుమారుడి ద్వారా ఫోన్ ద్వార సమాచారం తెలుసుకున్న  కృష్ణాజిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ గారు,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ జే .వి రమణ గారికి తెలియజేసి వారిని సురక్షితంగా అప్పగించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలియజేశారు.  వెంటనే సిఐ గారు స్పందించి వీరవల్లి పోలీస్ వారికి వారిని రక్షించాలని తెలియపడంతో హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకొని వారిద్దరి ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమింప చేసి వారి కుమారునికి సురక్షితంగా అప్పగించారు.

*వివరాల్లోనికి వెళ్తే*

_నరసాపురం  ప్రాంతానికి చెందిన ఓ వృద్ధ  దంపతులు వారికి గల కుటుంబ, ఆర్థిక, అనారోగ్య బాధల వలన భార్యాభర్తలిద్దరు ఎవరిపై భారం ఉండకుండా ఒకేసారి ఏదైనా కాలువలలో దూకి చనిపోవాలనే ఉద్దేశంతో నిన్న వారి ఇంటి వద్ద ఎవరికీ చెప్పకుండా బయలుదేరారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల మార్గమధ్యం లో గోదావరి నది, ఇతర నీటి కాలువలు వద్ద ఆత్మహత్య కు ప్రయత్నాలు చేసి అవి ఫలించక చివరిసారిగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో ఇద్దరు ఒకేసారి దూకి ఆత్మహత్య చేసుకుందామని  విజయవాడ బస్టాండ్ కు చేరుకున్నారు._

_ఇంతలో ఆ వృద్ధ దంపతుల కుమారుడు, కుటుంబ సభ్యులు వారి తల్లిదండ్రులను కాపాడుకోవడానికి  ఏమి చేయాలో  దిక్కుతోచని పరిస్థితులలో తల్లడిల్లిపోతూ చివరిగా వారు కృష్ణాజిల్లా  గౌరవ ఎస్ పి శ్రీ  అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ గారిని ఫోన్ ద్వారా సమాచారం అందించి తన తల్లిదండ్రులను కాపాడాలని కన్నీటి పర్యంతమై వేడుకున్నారు._

_వెనువెంటనే సమయం కాని సమయం అయినప్పటికీ అర్ధరాత్రి అని కూడ చూడకుండా వెంటనే స్పందించిన ఎస్పీ గారు గారు, ఎస్బి సి ఐ గారి పూర్తి పర్యవేక్షణలో వెంటనే వారిని ప్రాణాలతో కాపాడే బాధ్యత వీరవల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చిరంజీవి గారికి అప్పగించడం జరిగింది .ఎస్ఐ గారు  సిబ్బంది తో అర్ధరాత్రి శరవేగంగా విజయవాడ  కు చేరుకొని బస్టాండ్ నుండి కృష్ణా నదికి మధ్య ఉన్న అతి కొద్ది దూరంలో వారిని గుర్తించి, కృష్ణా నదిలోకి దూకుపోతున్న వారిని నిలవరించి, మాటలతో వారిని తీసుకువచ్చి, కౌన్సిలింగ్ నిర్వహించినారు. అనంతరం వారి బంధువులకు సమాచారం అందించి వారికి సురక్షితంగా అప్పగించడం జరిగింది_

_సమాచారం తెలుసుకుని వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చూపకుండా విజయవాడ  మెయిన్ బస్టాండ్ నుండి కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ కి మధ్య ఉన్న అతి తక్కువ దూరం లో కొన్ని నిమిషాలలో కృష్ణా నదిలో దూకి చనిపోవబోయే ఆ వృద్ధ దంపతులను కాపాడి వారికి సురక్షితంగా అప్పగించినందుకు జిల్లా ఎస్పీ గారికి, ఎస్ బి సి ఐ గారికి, వీరవెల్లి ఎస్ఐ గారికి సిబ్బందికి వారి కుమారుడు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సైతం కృష్ణా జిల్లా పోలీసు వారికి ప్రశంసలు కురిపిస్తున్నారు._

Also read

Related posts

Share via