December 12, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Guntur: గుంటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. రూ.2 కోట్లు డిమాండ్ చేసిన వైకాపా నేత



నల్లపాడులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఇమడాబత్తిన నాగేశ్వరరావును వైసీపీ నేత దుగ్గెం నాగిరెడ్డి కిడ్నాప్ చేసి రూ.2కోట్లు డిమాండ్ చేశాడు.

గుంటూరు: నల్లపాడులో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్  ఘటన కలకలం రేపింది. ఇమడాబత్తిన నాగేశ్వరరావును వైసీపీ నేత దుగ్గెం నాగిరెడ్డి కిడ్నాప్ చేసి రూ.2కోట్లు డిమాండ్ చేశాడు. బాధితుడు తన వద్ద అంత డబ్బులేదని చెప్పడంతో భౌతిక దాడికి పాల్పడ్డాడు. నాగేశ్వరరావు, నాగిరెడ్డి ఇద్దరూ వైసీపీ కు చెందిన వారే కావడం గమనార్హం. ఇద్దరికీ బాగా పరిచయం ఉండటంతో.. నాగిరెడ్డి వచ్చి కారు ఎక్కమనగానే ఆలోచించకుండా కారు ఎక్కినట్టు బాధితుడు నాగేశ్వరరావు తెలిపారు.

నల్లపాడు నుంచి పేరేచర్ల కైలాసగిరి వైపు తీసుకెళ్లి రూ.2 కోట్లు కావాలని నాగిరెడ్డి డిమాండ్ చేశాడని వెల్లడించారు. డబ్బులు లేవని బదులివ్వడంతో… తనపై దాడి చేసి కొట్టడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడన్నారు. కైలాసగిరి కొండ మీదకు తీసుకెళ్లి చంపేందుకు ప్రయత్నించగా.. కొండ మీద నుంచి కింద పడి తప్పించుకున్నట్లు నాగేశ్వరరావు వాపోయారు. స్థానికుల సాయంతో అక్కడి నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నట్లు వెల్లడించారు. నాగిరెడ్డితో తనకు ఎలాంటి వ్యాపారాలు, లావీదేవీలు, గొడవలు లేవని, కేవలం డబ్బుకోసమే కిడ్నాప్ చేశాడన్నారు. ప్రస్తుతం నాగేశ్వరరావు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read

Related posts

Share via