SGSTV NEWS
Andhra PradeshCrime

Kidnap : శ్రీ సౌమ్య.. కశింకోట అనిల్ కుమార్ ను   ప్రేమించిందా..?

👉ప్రేమించి ఉంటే కిడ్నాప్ డ్రామా ఎందుకు ఆడినట్టు?

👉 కశింకోట అనిల్ కుమార్పై ఉన్న డ్రగ్స్ కేసుల మాటేమిటి?

👉 శ్రీ సౌమ్యను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?

👉  అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి



Kidnap : ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన
సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీ సౌమ్య.. కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఒక్క రోజులోనే కేసును ఛేదించారు. కిడ్నాపర్లతోపాటు శ్రీ సౌమ్యను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా శరభవరం సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీసౌమ్య కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. ఆమెతోపాటు ఆమెను ఎత్తుకెళ్లిన నిందితులను కూడా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ తెలిపారు..

సోయం శ్రీసౌమ్యను కిడ్నాప్ చేసిన వ్యక్తిని కశింకోట అనిల్ కుమార్గా గుర్తించారు. గతంలో నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు గతంలో ఇద్దరూ కలిసి పారిపోయిన సమయంలో అమ్మాయి మైనర్గా ఉండేదని.. ఇప్పుడు మేజర్ అయినట్లు వెల్లడించారు. ఐతే అదే వ్యక్తి ఇప్పుడు మళ్లీ కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయినట్లు చెబుతున్నారు ఎస్పీ. పైగా కశింకోట అనిల్ కుమార్ అనే వ్యక్తిపై డ్రగ్స్ కలిగి ఉన్నాడనే నేరంపై NDPS సెక్షన్ కింద కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు..

శరభవరంలోని సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పని చేస్తున్న శ్రీసౌమ్యను.. గురువారం ఉదయం ఆఫీసు నుంచే కొంత మంది ఎత్తుకెళ్లారు. ఆఫీసుకు వచ్చిన దుండగులు ఇన్నోవా కారులో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారు. అక్కడ కొంత మంది వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐతే చివరకు ఆమె గతంలో ప్రేమించిన వ్యక్తి కశింకోట అనిల్ కుమారే ఆమెను మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి కిడ్నాప్ చేసినట్లు తేలింది………

ఈ కేసులో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు……… శరభవరం, మారేడుమిల్లి రవాణా మార్గాల్లోని అన్ని CCTV ఫుటేజ్లను పరిశీలించారు. అంతే కాదు ఇన్నోవా వాహనాన్ని గుర్తించేందుకు అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. చివరకు కిడ్నాపర్లను ఒడిశాలోని చిత్రకొండలో పట్టుకున్నారు.. మొత్తానికి కిడ్నాప్ కథ ముగిసింది. కానీ శ్రీ సౌమ్య.. నిజంగానే కశింకోట అనిల్ కుమార్ను ప్రేమించిందా? ఒకవేళ ప్రేమించి ఉంటే కిడ్నాప్ డ్రామా ఎందుకు ఆడినట్టు? కశింకోట అనిల్ కుమార్పై ఉన్న డ్రగ్స్ కేసుల మాటేమిటి? అతనికి మంచి ఉద్దేశ్యమే ఉంటే.. శ్రీ సౌమ్యను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది..

Also read

Related posts

Share this