ఖమ్మంలో దారుణం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికను ప్రేమ పేరిట లెక్చరర్ వేధింపులకు గురిచేయడం కలకలం రేపుతోంది. ఐ లవ్ యూ బంగారం. తిన్నావా, పడుకున్నావా, రమ్మంటావా అంటూ సైకో చేష్టలకు పాల్పడిన హరిశంకర్‌ను అరెస్ట్ చేసి ఫొక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
Khammam: ఖమ్మంలో మరో దారుణం జరిగింది. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిని ప్రేమ పేరిట లెక్చరర్ వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపుతోంది. ఐలవ్ యూ బంగారం తిన్నావా, పడుకున్నావా, రమ్మంటావా అంటూ సైకో చేష్టలకు పాల్పడిన హరిశంకర్‌ను అరెస్ట్ చేసి ఫొక్సో కేసు నమోదు చేశారు పోలీసులు
కొంతకాలంగా అసభ్య ప్రవర్తన..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గాంధీచౌక్ వద్ద ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ గా కె.హరిశంకర్ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఎస్సీ బాలికల వసతి గృహంలో ఆశ్రయం ఉంటూ ఈ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినితో కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయంలో పెద్దగా పట్టించుకోనట్లే వ్యవహరించింది బాలిక. దీంతో మరింత రెచ్చిపోయిన శంకర్ టార్చర్ చేస్తూనే ఉన్నాడు.
దీంతో లెక్చరర్ వేధింపులకు భయపడి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది విద్యార్థిని. ‘ఐలవ్ యూ బంగారం. తిన్నావారా. పడుకున్నావా. ఇప్పుడు రమ్మంటావా’ అంటూ తనకు ఫోన్ కాల్స్, మెసేజెస్ చేస్తున్నాడని చెప్పింది. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవ్వాలని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆందోళన చెందింది. ఈ విషయాన్ని ఆమె పేరెంట్స్ కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లగా లెక్చరర్ వ్యవహారంపై నిఘా పెట్టి బాగోతం బయటపెట్టారు.
ఈ క్రమంలోనే శంకర్ పిచ్చి చేష్టలపై జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ తమకు కంప్లైంట్ ఇచ్చారని ఖమ్మం త్రీటౌన్ పోలీసులు తెలిపారు. దంతో లెక్చరర్ హరిశంకర్ పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అంతర్గత విచారణకు ఆదేశించారని, వెంటనే లోతుగా విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్లు ఖమ్మం జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి రవిబాబు, కళాశాల ప్రిన్సిపాల్ అరుణ్ కుమార్ తెలిపారు. విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేశారు.
Also read
- నేటి జాతకములు..13 మార్చి, 2025
- పోసానికి మరో షాక్ – పీటీ వారెంట్‌తో జైలు నుంచి విడుదలకు బ్రేక్
- చిత్తూరు కాల్పుల ఘటనలో బిగ్ ట్విస్ట్ – దోపిడీకి వ్యాపారి ప్లాన్ –
- పోలీసులకు చుక్కలు చూపించాడు.. తప్పించుకుని ముప్పుతిప్పలు పెట్టిన ఖైదీ!
- Andhra: చోరీ చేసిన సొత్తు ఎక్కడ అంటే.. ఓ చోట గోతాల్లో ఉన్నాయన్నారు.. వెళ్లి చెక్ చేయగా..