April 19, 2025
SGSTV NEWS
CrimeTelangana

Khammam Crime: ఖమ్మంలో కసాయి కోడలు.. మామ కంట్లో కారం చల్లి.. ఏం చేసిందంటే!


టీచర్‌గా ఉద్యోగం చేస్తున్న ఓ కోడలు ఆస్తి కోసం మామ కంట్లో కారం చల్లి దాడి చేసిన ఘటన ఖమ్మంలో జరిగింది. తన ఇద్దరు చెల్లెళ్లతో కోడలు ఆ దాడికి పాల్పడింది. ఆస్తి కోసం గత మూడేళ్ల నుంచి మామను వేధిస్తోంది. వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు
.


ఈ మోడ్రన్ ప్రపంచంలో కోడళ్లు కిరాతకంగా మారుతున్నారు. అత్తమామలను కన్న తల్లిదండ్రులుగా చూసుకోకుండా దారుణంగా వారితో ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ కోడలు మామను చూసుకోకుండా దాడికి పాల్పడింది. చదువుకుని టీచర్ ఉద్యోగం చేస్తున్న కోడలు ఆస్తి కోసం కంట్లో కారం చల్లిన దారుణ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది

కేవలం ఆస్తి కోసమే..
వివరాల్లోకి వెళ్తే.. ఏన్కూరు మండలం కోనాయపాలెం గ్రామంలో ఉంటున్న ఓ మహిళ ఆస్తి కోసం తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి మామ కంట్లోకి కారం చల్లింది. దీంతో ఆ వృద్ధుడు గట్టిగా అరవడంతో స్థానికులు వచ్చారు. టీచర్ ఉద్యోగం చేస్తున్న ఈ కోడలు కేవలం ఆస్తి కోసమే ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. మామ నుంచి ఆస్తులు రావాల్సి ఉండటంతో గత మూడేళ్ల నుంచి కోడలు వేధిస్తోంది. దీంతో వృద్ధుడు పోలీసు స్టేషన్‌లో కోడలిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

ఇదిలా ఉండగా విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జరిగింది. చదువు చెప్పాల్సిన గురువే ఓ విద్యార్థిని పాలిట శాపం అయ్యాడు. నైతిక విలువలు నేర్పించాల్సిన గురువు మైమరిచి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని భవానీపురం జోజినగర్‌కు చెందిన పుల్లేటికుర్తి భువనచంద్ర (31) తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ స్కూల్‌లో చదువుతున్న ఓ పదో తరగతి బాలిక స్పెషల్ క్లాస్‌కు వెళ్లింది. ఈ సమయంలో ఉపాధ్యాయుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో బాలిక భయపడి.. స్కూలు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఉపాధ్యాయుడు నేరం చేసినట్లు రుజువు కావడంతో పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఈ జరిమానాలో రూ.10 వేలు, నష్టపరిహారం కింద రూ.3 లక్షలు బాధితురాలికి అందజేయాలని డిస్ట్రిక్ట్‌ లీగల్‌సెల్‌ అథారిటీని న్యాయమూర్తి ఆదేశించారు

Also read

Related posts

Share via