February 3, 2025
SGSTV NEWS
CrimeTelangana

Khammam: అన్న వాట్సాప్‌కు తమ్ముడి న్యూడ్ ఫోటోలు..మీడియా చేతిలో సూసైడ్ నోట్!



ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ కోసం లోన్ యాప్‌లో తీసుకున్న లక్ష రూపాయల అప్పు కట్టలేకపోవడంతో నిర్వాహకులు న్యూడ్ ఫొటోస్ అన్నకు, బంధువులకు పంపించారు. దీంతో భద్రాధ్రికొత్తగూడెం జిల్లాకు చెందిన సంతోష్ లోథ్ (21) సూసైడ్ చేసుకున్నాడు.

Khammam: ఆన్ లైన్ గేమ్ మోసానికి తెలంగాణలో మరో యువకుడు బలయ్యాడు. గత కొంతకాలంగా అత్యాశతో బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడులు పెట్టి దారుణంగా దివాలా తీసిన యువత.. లోన్ యాప్స్ లో అప్పులు చేస్తూ అవి చెల్లించలేక బలవన్మరణానికి పాల్పడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో లోన్ యాప్ వేధింపులు తాళలేక సంతోష్ లోథ్ (21) అనే యువకుడు తనువు చాలించిన ఘటన సంచలనం రేపుతోంది.

లోన్ యాప్ ద్వారా లక్షరూపాయల అప్పు..
ఈ మేరకు ఆన్ లైన్ బెట్టింగ్ కు అలవాటుపడ్డ సంతోష్ లోథ్ లోన్ యాప్ ద్వారా లక్షరూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ సొమ్మంతా బెట్టింగ్ యాప్ లో ఇన్వెస్ట్ చేశాడు. దీంతో బెట్టింగ్ యాప్ మోసానికి గురయ్యాడు. ఈ లక్ష కాకుండా మరో పదివేల రూపాయలు బయట అప్పుచేసి మరోసారి బెట్టింగ్ యాప్ లో ఇన్వెస్ట్ చేశాడు. అవి కూడా పోవడంతో తీసుకున్న అప్పు కట్టలేక పోయాడు. ఈ క్రమంలో తమ డబ్బులు చెల్లించాలంటూ లోన్ యాప్స్ నిర్వహకులు ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. అయినా చెల్లించలేక చేతులెత్తేశాడు.

ఫోటోలను మార్ఫింగ్ చేసి..
గడువు దాటిపోవడంతో సంతోష్ ఫోటోలను మార్ఫింగ్ చేసిన లోన్ నిర్వహకులు.. న్యూడ్ ఫోటోలను అన్నలకు వాట్సాప్ ద్వారా పంపించారు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించని పక్షంలో మార్ఫింగ్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో, పోర్న్ వెబ్ సైట్లలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సంతోష్ లోథ్ దారుణానికి పాల్పడ్డాడు. గతంలో ఇల్లందుకు చెందిన ఓయువతిని ప్రేమించగా.. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మనస్తాపం చెందాడు. ప్రియురాలి మరణానికి తోడు లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు అధికమవడంతో గత శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆత్మహత్యాయత్నానికి ముందు తన మృతికి గల కారణాలను సన్నిహితులకు, స్నేహితులకు పంపించాడు. సంతోష్ మృతికి కేవలం ప్రేమ వ్యవహారమే కారణమంటూ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. లోన్ యాప్ వ్యవహారం, నిర్వాహకుల వేధింపులు బయటికి వస్తే కుటుంబం పరువుపోతుందనే భయంతో నిజాన్ని దాచారు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.

Also read

Related posts

Share via