తెలంగాణలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన శ్రావణిని ప్రేమ పేరుతో వేధిస్తున్న గణేష్ ఆమె ఇంటి వాకిట్లో ముగ్గులేస్తుండగా యాసిడ్ దాడి చేశాడు. అనంతరం పారిపోయిన నిందితుడిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ దోమల రమేష్ తెలిపారు.
Khammam: తెలంగాణలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఖమ్మంలోని శ్రీనివాసనగర్ లో శ్రావణి అనే యువతిని తరచూ ప్రేమ పేరిట వేధించిన గణేష్ ఆమె అంగీకరించకపోవడంతో దారుణానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించకపోతే శ్రావణి తల్లిని, తమ్ముడిని చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
జనవరి 13న సంక్రాంతి పండుగ రోజు..
అయినప్పటికీ యువతి ఒప్పుకోకపోవడంతో శ్రావణిపై యాసిడ్ పోశాడు గణేష్. జనవరి 13న సంక్రాంతి పండుగ రోజు తెల్లవారు జామున తమ ఇంటి వాకిట్లో ముగ్గులేస్తుండగా యాసిడ్ దాడి చేశాడు. వెంటనే తేరుకున్న శ్రావణి తప్పించుకుని ఇంట్లోకి పరిగెత్తింది. శ్రావణి అరుపులు కేకలు వేయడంతో గమనించిన స్థానికులు అక్కడికి చేరుకునేలోపు గణేష్ పరారయ్యడు.
ఇక యాసిడ్ తీవ్రతతో శ్రావణి శరీరంలో పలు భాగాలకు బొబ్బలు వచ్చాయి. దీంతో హుటాహుటిన కుటుంబసభ్యులు ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ గణేష్ వేధింపులు తాళలేక ఆమె రెండుసార్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. శ్రావణి తల్లి పలుమార్లు మందలించినా గణేష్ లో మార్పు రాకపోవడతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. శ్రావణి ఖమ్మం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలో రెండోసంవత్సరం విద్యనభ్యసిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులకు శ్రావణి ఫిర్యాధు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఖమ్మం త్రీటౌన్ సీఐ దోమల రమేష్ తెలిపారు. పారిపోయిన గణేష్ ను పట్టుకుని స్టేషన్ తరలించినట్లు చెప్పారు. తండ్రి మరణించడంతో ఓస్కూల్ లో ఆయాగా పనిచేస్తున్న శ్రావణి తల్లి కొడుకు వెంకటేష్ , కూతురు బాగోగులు చూసుకుంటోంది. గణేష్ తో తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది