బెంగళూరు నగరంలో మహాలక్ష్మి అనే 29 ఏళ్ల మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసింది. ఆమెను 50 ముక్కలుగా చేసి..ఫ్రిజ్ లో పెట్టారు. ఈ ఘటన కర్నాటక వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి..కీలక అప్ డేట్ వచ్చింది.
శ్రద్దావాకర్ అనే యువతి హత్య తరహాలో కర్నాటక రాష్ట్రంలో ఓ మహిళ హత్య ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో 29 ఏళ్ల మహాలక్ష్మి అనే మహిళను అత్యంత దారుణంగా హత్యగావింపబడింది. ఆమెను దాదాపు 50 ముక్కలు చేసి..రిఫ్రిజిరేటర్ లో కుక్కేశారు. రెండేళ్ల కిందట ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే మహాలక్ష్మిని కూడా దారుణంగా చంపాడు. రెండు రోజుల కిందట వెలుగులోకి వచ్చిన మహిళ హత్యోదంతం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహాలక్ష్మి హత్య కేసులో కీలక అప్ డేట్ వచ్చింది. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….
శనివారం బెంగళూరు నగరం అంతా ఒక్కసారి ఉల్కికి పడింది. కారణంగా..ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మహాలక్ష్మి అనే మహిళను 50 ముక్కలుగా నరికి చంపేశారు. ఇక మహాలక్ష్మి నివాసం ఉండే అపార్టమెంట్ లో ఆమె డెడ్ బాడీని చూసిన స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఇంత భయానక వాతావరణం సృష్టించిన ఈ హత్యా ఘటనలో తాజాగా ఈ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఆమెను హత్యచేసిన వ్యక్తి ఎవరు అనేది పోలీసులు గుర్తించారు. అతడ్ని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సోమవారం బెంగళూరు నగర కమిషనర్ దయానంద్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కేసుకు సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావించారు. ప్రధాన నిందితుడ్ని గుర్తించామని, అతడిది వేరే రాష్ట్రమని తెలిపారు. ఇక ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తునట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉండగా ఇంతకంటే ఎక్కువ వివరాలను వెల్లడించలేమని ఆయన తెలిపారు.
మొత్తంగా మహాలక్ష్మి హత్య కేసులో పోలీసులు నిందితుడిని గుర్తించడంతో కేసు మరో మలుపు తిరిగింది. ఇదే కేసు విషయంపై కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర స్పందించారు. పోలీసులు ప్రధాన నిందితుడ్ని గుర్తించారని, అతడి సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ మంత్రి అన్నారు. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. ఘటనా స్థలిలో బాధితురాలు మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, స్విచ్ఛాప్ లో ఉండటంతో ఆమె ఆఫ్ చేశారా? లేదా హత్య తర్వాత నిందితులు అలా చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఆమె కాల్ రికార్డ్ లు, సోషల్ మీడియా యాక్టివిటీ, వాట్సాప్ చాట్ లను పోలీసులు సేకరిస్తున్నట్లు సమాచారం. తదుపరి విశ్లేషణ కోసం దానిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపే యోచనలో ఉన్నారు.
ఇక ఈ కేసు విషయానికి వస్తే..హతురాలు మహాలక్ష్మి పశ్చిమ్ బెంగాల్ కి చెందిన మహిళ. ఆమె భర్తతో విబేధాల కారణంగా వేరే ప్రాంతంలో ఒంటరిగా నివాసం ఉంటుంది. ఇదే సమయంలో మల్లేశ్వరంలోని ఓ మాల్ లో పని చేస్తుంది. ఈమెకు నాలుగేళ్ల కుమార్తె కూడా ఉన్నట్లు మృతురాలి బంధువులు తెలిపారు. మహా లక్ష్మిని ఒక వ్యక్తి రోజూ వచ్చి తీసుకెళ్లి.. మళ్లీ తిరిగి ఇంటి వద్ద దింపుతాడని స్థానికులు తెలిపారు. దీంతో అతడే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫ్రిజ్ లో మహాలక్ష్మి ఛిద్రమైన అవశేషాలు చూసి కుటుంబసభ్యులు, స్థానికులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.
Also read
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..
- Andhra Pradesh: 10 నిమిషాల్లో ఇంటికి చేరేవారే.. కానీ అంతలోనే కబలించిన మృత్యువు!