April 11, 2025
SGSTV NEWS
CrimeNational

అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!

• భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యాయత్నం

• గర్భిణి అని చూడకుండా చిత్రహింసలు

• దావణగెరె జిల్లాలో దారుణ



బళ్లారి: దావణగెరె జిల్లా చెన్నరాయపట్న
తాలూకాలో దారుణం జరిగింది. భర్త చేతిలో భార్య హత్యకు గురైంది. జిల్లాలోని చెన్నరాయపట్న తాలూకా నూరనక్కి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాలు… మూడేళ్ల క్రితం నూరక్కి గ్రామానికి చెందిన అయ్యప్పతో నయన (24)కి వివాహం జరిగింది.

ఏడాదిన్నర పాటు దంపతుల సంసారం సజావుగా సాగింది. ఈనేపథ్యంలో పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని అయ్యప్ప తరచూ చిత్రహింసలకు గురిచేసేవాడు. మూడు నెలల గర్భిణి అని తెలిసిన గొడవ పడేవాడు. దీంతో రెండు నెలలుగా నయన పుట్టింటిలోనే ఉండిపోయింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం అయ్యప్ప అత్తింటికి వచ్చాడు. ఈనెల 17న రాత్రి భార్యకు మాయమాటలు చెప్పి పక్కనే ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అక్కడే ఆమెను హత్య చేశాడు. అనంతరం నయన తల్లికి ఫోన్ చేసి మీ కుమార్తెను హత్య చేసినట్లు చెప్పి ఫోన్ కట్ చేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. వేధింపులపై స్థానిక పోలీస్టేషన్లో రెండుసార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికి పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై చెన్నరాయపట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Also read

Related posts

Share via