SGSTV NEWS
Andhra PradeshCrime

Kadapa: ప్రేమజంట కనిపిస్తే చాలు.. కానిస్టేబుల్  అరాచకాలు



అతడో ఏఆర్ కానిస్టేబుల్. ప్రేమజంట కనిపిస్తే ఫొటోలు తీసి భయపెట్టి అందినకాడికి దోచుకోవడమే అతడి పని. ఇటీవల అతడి వేధింపులు తాళలేక ఓ బీటెక్ యువతి ఉరేసుకుని

కడప, న్యూస్టుడే, కడప నేరవార్తలు, రాజంపేట గ్రామీణ: అతడో ఏఆర్ కానిస్టేబుల్.

ప్రేమజంట కనిపిస్తే ఫొటోలు తీసి భయపెట్టి అందినకాడికి దోచుకోవడమే అతడి పని. ఇటీవల అతడి వేధింపులు తాళలేక ఓ బీటెక్ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ను రాజంపేట పోలీసులు అరెస్టుచేయగా, కడప జిల్లా పోలీసులు సస్పెండ్ చేశారు. కడప ఆర్మ్డ్ విభాగంలో కె.రామ్మోహన్రెడ్డి (ఏఆర్పీసీ 328) పనిచేస్తున్నాడు. తన బంధువైన ప్రొద్దుటూరుకు చెందిన అనిల్కుమార్రెడ్డిని పాలకొండల్లో అనధికారికంగా నియమించుకున్నాడు. అక్కడకు వచ్చే ఒంటరి మహిళలు, ప్రేమజంటలను అనిల్ ఫొటోలు తీసి, వారి ఫోన్ నంబర్ అడిగి.. ఆ వివరాలు రామ్మోహన్రెడ్డికి పంపేవాడు. అతడు పాలకొండలకు వచ్చి తల్లిదండ్రులకు చెబుతానని భయపెట్టి, అందినకాడికి దండుకునేవాడు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బీటెక్ విద్యార్థిని, స్నేహితులు పాలకొండలకు వెళ్లారు. వెంటనే అనిల్ వారి ఫొటోలు తీయగా, రామ్మోహన్రెడ్డి వెళ్లి భయపెట్టాడు. దీంతో వారు రూ.4 వేలు ఇచ్చి బయటపడ్డారు. తర్వాత మళ్లీ వేధించడంతో మరో రూ.10 వేలు ఇచ్చుకున్నారు. ఇంకా డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో ఆ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే సమయంలో రామ్మోహన్రెడ్డి ఆమె తండ్రికి ఫోన్ చేసి బెదిరించడంతో అసలు విషయం బయటపడింది. యువతి తల్లిదండ్రులు ఫిర్యాదుచేయగా పోలీసులు అనిల్కుమారెడ్డిని, రామ్మోహన్రెడ్డిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు అతడు పలువురిని బెదిరించి భారీగా డబ్బులు దండుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో రామ్మోహన్రెడ్డిని సస్పెండ్ చేస్తూ కడప జిల్లా పోలీసు అధికారి అశోకుమార్ ఉత్తర్వులు జారీచేశారు.

Also read

Related posts

Share this