SGSTV NEWS
CrimeNational

Kabaddi Game: కబడ్డీ కోర్టులో విషాదం.. కరెంట్ వైర్ తెగిపడి స్పాట్‌లోనే ముగ్గురు!


కబడ్డీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కరెంట్ వైర్ తెగిపడి స్పాట్‌లోనే ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన ఛత్తీస్‌గడ్‌లో చోటుచేసుకుంది. కొండగావ్ పండుగ సందర్భంగా అక్కడ కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన టెంట్‌పై వైర్ పడింది.

కబడ్డీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కరెంట్ వైర్ తెగిపడి స్పాట్‌లోనే ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన ఛత్తీస్‌గడ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొండగావ్ పండుగ సందర్భంగా అక్కడ కబడ్డీ పోటీలు(Kabaddi Game) నిర్వహించారు. ఈ క్రమంలో ప్రేక్షకుల కోసం టెంట్ ఏర్పాటు చేశారు. దీనికి విద్యుత్ లైన్ తగలడంతో స్పాట్‌లోనే ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనలో మిగతా ప్రేక్షకులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. అయితే తుపాను కారణంగా ఆ విద్యుత్ లైన్ టెంట్‌పై పడి ఉంటుందని అనుమానిస్తు్న్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read

Related posts