SGSTV NEWS
Astrology

బృహస్పతి నక్షత్ర మార్పు.. ప్రతి రంగంలోనూ అఖండ విజయాలు వీరి సొంతం



Jupiter nakshtra transit: దేవ గురువు బృహస్పతి నక్షత్రం మార్చుకోబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వారికి సంపద పెరుగుతుంది. ధనవంతులు కాబోతున్నారు. అవి ఏ రాశులో తెలుసుకుందాం.

రోహిణి నక్షత్రంలోకి గురు గ్రహం

Jupiter nakshtra transit: దేవ గురువు బృహస్పతి మే 1న వృషభ రాశిలోకి ప్రవేశించాడు. 2024 సంవత్సరం పొడవునా వృషభ రాశిలోనే కూర్చుంటాడు. 12 సంవత్సరాల తర్వాత గురు గ్రహం వృషభ రాశిలోకి వచ్చింది. కానీ ఈ ఏడాది బృహస్పతి మొత్తం నాలుగు సార్లు తన నక్షత్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఇది మేషం నుంచి మీన రాశి వరకు శుభ, అశుభ ప్రభావాన్ని చూపుతుంది.

హిందూ క్యాలెండర్ ప్రకారం గురు గ్రహం జూన్ 13న రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 20 వరకు ఈ నక్షత్రంలో సంచరిస్తాడు. బృహస్పతి రోహిణి నక్షత్రానికి వెళ్లడం వల్ల కొన్ని రాశుల వారికి చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి మానసిక స్థైర్యం ఎక్కువగా ఉంటుంది. అద్భుతమైన తెలివితేటలు ప్రదర్శిస్తారు. ఇతరులను తమ మాటలతో ఆకట్టుకుంటారు. ఎన్ని విమర్శలు ఎదురైన తట్టుకుని అనుకున్నది సాధించగల మనస్తత్వం ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఉంటుంది. అటువంటి ఈ నక్షత్రంలోకి శుభ గ్రహంగా పరిగణించే బృహస్పతి రాక అనేక శుభాలు చేకూరుస్తుంది.

గురు గ్రహం రోహిణి నక్షత్రంలోకి వెళ్ళడం వల్ల సంతోషం, అదృష్టం పెరిగే అవకాశం ఉంది. నూతన ఆదాయ మార్గాలు లాభం ఇస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతి పని ఆశించిన ఫలితాలను ఇస్తుంది. గురు నక్షత్ర మార్పు ఏ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.

మేష రాశి
గురు గ్రహం నక్షత్రం మారడం వల్ల మేష రాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. నూతన ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార ప్రయోజనాలు ఉంటాయి. సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లలు మీకు మనసుకి హాయినిచ్చే శుభవార్తలు అందిస్తారు. మీరు మీ జీవితాన్ని ఆనందంగా భౌతిక సౌకర్యాలతో గడుపుతారు.

కర్కాటక రాశి
బృహస్పతి కదలికను మార్చడం వల్ల కర్కాటక రాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగ వ్యాపారాలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీర్ఘకాలంగా ఏర్పడుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకోవడంతో వ్యాపారంలో రాణిస్తారు.

తులా రాశి
బృహస్పతి రోహిణి నక్షత్రానికి వెళ్లడం వల్ల తులా రాశి వారికి మేలు జరుగుతుంది. ప్రతి రంగంలోనూ అఖండ విజయాలు సాధిస్తారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధ సమస్యలు దూరం అవుతాయి. ఇతరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. తోబుట్టులతో సంబంధాలు మరింత బలపడతాయి. వారితో విభేదాలు తొలగి కలిసిపోతారు. శుభ గ్రహమైన బృహస్పతి అనుగ్రహంతో అవివాహితులకు ఈ సమయంలో వివాహం కుదిరే అవకాశం ఉంది

Related posts

Share this