Jagtial Murder: నేటి సమాజంలో మారుతున్న విలువలు, క్షణికావేశాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. నూరేళ్ల పాటు తోడుంటామని ప్రమాణం చేసిన వారు.. మూడో వ్యక్తి ప్రవేశంతో దారి తప్పుతున్నారు. ఈ క్రమంలో ఏర్పడే అక్రమ సంబంధాలు ప్రాణాలు తీసుకునే వరకు, లేదా ఎదుటివారిని హతమార్చే వరకు వెళ్తున్నాయి.
తాజాగా జగిత్యాల జిల్లాలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొంది. తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడన్న కోపంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త.. సదరు వ్యక్తిపై పట్టపగలే నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కర్రలతో అతి దారుణంగా కొట్టి చంపి, కళ్లముందే ఒక కుటుంబాన్ని రోడ్డున పడేశాడు.
జగిత్యాల పట్టణంలో ఆదివారం చోటుచేసుకున్న దారుణ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అక్రమ సంబంధం వివాదమే ఈ హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. పట్టణంలోని బైపాస్ రోడ్డుపై కరీంనగర్ డైరీ ఎదుట విశ్వనాథ్ అనే వ్యక్తిని బహిరంగంగా కర్రలతో దాడి చేసి హత్య చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటన మహాశివరాత్రి రోజు ఉదయం చోటుచేసుకోవడం మరింత ఆందోళనకు దారితీసింది.
పోలీసుల సమాచారం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ వివాహిత మహిళతో విశ్వనాథ్ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఆ మహిళకు పన్నెండు సంవత్సరాల క్రితమే వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత నాలుగు నెలలుగా ఆమె మృతుడితో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మహిళ భర్తనే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా గుడికి వెళ్తున్న సమయంలో సాయిబాబా బైపాస్ వద్ద ఆటోలో వచ్చి నిందితుడు కర్రతో దాడి చేసి విశ్వనాథ్ను హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రక్తపుముడుగులో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Jagtial Murder: మహా శివరాత్రి వేళ మారణహోమం.. ఆటోలో వచ్చి అడ్డగించి.. కర్రలతో కొట్టి..!
- విశాఖలో పండగపూట విషాదం.. బీటెక్ విద్యార్థి మృత
- బొగ్గుల శ్రీనివాస్ మరణం వెనుక మిస్టరీ.. పాలేరు జలాశయంలో కారు ప్రమాదం.. హత్యనా? ఆత్మహత్యనా?
- Andhra News: అయ్యో ఏం జరిగిందో పాపం.. హాస్టల్ వాష్‌రూమ్‌లో విగతజీవిగా కనిపించిన విద్యార్థి!
- మహాశివరాత్రి కథ.. శివపార్వతుల కళ్యాణం నేటి ఆధునిక జీవితానికి ఓ ఆధ్యాత్మిక గాథ





