November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

జగన్ లాండ్ గ్రాబియింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం… చంద్రబాబు నాయుడు

*జగన్ కి ఓటేస్తే ప్రజల ఆస్థి గోవిందా*

*జగన్ లాండ్ గ్రాబియింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం*

*జే బ్రాండ్లతో ప్రజల ప్రాణాలను హరిస్తున్న ‘జగ్గుభాయ్’*

*డ్రైవింగ్ తెలియక రివర్స్ పాలన చేస్తున్న డ్రైవర్ జగన్*

*టిడిపి వెన్నుముక బీసీలకు తోడుగా నిలబడతాం*

*చేనేత కార్మిక కుటుంబాలను ఆదుకుంటాం*

*ఆయారాం, గయారాంలకు టిడిపిలో చోటు లేదు*

*ప్రజల పొట్ట కొట్టి తన పొట్ట నింపుకునే దళారి జగన్*

*చీరాల ప్రజాగళం సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు*

చీరాల:- చీరాల అంటే చరిత్ర కలిగిన ప్రాంతం. 1919లో చీరాల – పేరాల ఉధ్యమంలో బ్రిటీష్ వాళ్లు మున్సిపాలిటీ చేసి పన్నులు బాధుడే బాదుడు చేశారు. ఇప్పుడు సైకో అదే విధంగా అదే పని చేస్తున్నారు. నాడు దుగ్గిరాల గోపాల కృష్ణయ్య నేతృత్వంలో పోరాటం చేశారు. ఈ పన్నులు తట్టుకోలేక ఊరుకే ఊరే ఖాళీ చేసి రాంనగర్ అనే ఊరునే నిర్మాణం చేసుకొని నిరసన తెలిపారు. అలాగే ఉద్యమం చేసిన వారసులు ఈ చీరాల ప్రజలు. ఎన్నికల ముందు అందరి దగ్గరకు వచ్చి ముద్దులు పెట్టాడు, నెత్తిన చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, తీరా అధికారంలోకి వచ్చాక పిడి గుద్దులు గుద్దాడు.

*బ్రిటిష్ వాళ్లను మించిన పన్నులు ఏపీలో*

ఐదేళ్లల్లో అన్ని ధరలు పెరిగాయి, యువతకు ఉద్యోగాలు వచ్చాయా? ఈ ప్రజలు పడిన కష్టాలు చూస్తే బాధ కలుగుతుంది. టిడిపి ప్రభుత్వం ఏనాడు కరెంట్ పెంచలేదు. అదే జగన్ 9 సార్లు పెంచారు. ఒకప్పుడు రూ.200 ఉన్న కరెంట్ ధర ఇప్పుడు రూ.1000 పెరిగింది. ఇలాంటి పరిపాలన కావాలా? బ్రిటిష్ వాళ్లను మించి పన్నులు బాధుతున్నాడు. నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బియ్యం, పప్పు, వంటనూనె, చెక్కర చేదయ్యింది.

*జే ‘జగ్గుభాయ్’ బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చలగాటం*

జగన్ ఒక దళారి, ప్రజల పొట్ట కొట్టాలో తెలిసిన వ్యక్తి. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకున్నాడు. క్వార్టర్ రూ.65 ఉన్న మద్యం ధర నేడు రూ.200 పెరిగింది. తోపుడు బండ్లలోను ఆన్ లైన్లు ఉంటే మద్యం షాపులో ఆన్ లైన్ ఉందా? మ్యానిఫాక్చర్, హోల్ సేల్, రిటైల్ మనుషులందరూ జగన్ వాళ్లే. పేద వాళ్ల రక్తం తాగుతున్నారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఏపీలోనే ఉన్నాయి. అదే జే బ్రాండ్ అంటే జగ్గు భాయ్ బ్రాండ్లు తెచ్చారు. నాశిరకం మద్యంతో 30వేల మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెచ్చారు.

*ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలు పెట్టిన విధ్వంసకారి జగన్*

ఒకప్పుడు ఇసుక ఉచితంగా దొరికేది. ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక రూ.5000 పెంచేశారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా ఆత్మహత్యలు చేసుకున్నారు, రోడ్లు పాలయ్యారు. కాని జగన్ కి ఏమాత్రం లెక్కలేనితనం వచ్చేసింది. బెదిరించి భయబ్రాంతులకు గురి చేసి ఈ రాజ్యాన్ని నియంతలా పాలించాలనుకున్నారు. జగన్ అహంకారి, సైకోకి తోడు విధ్వంసమే అలవాటు. ఏ ముఖ్యమంత్రి అయినా మంచి సాంప్రదాయంతో పాలన చేశారు. కాని జగన్ మాత్రం ప్రజావేదిక కూల్చివేసి పాలన మొదలుపెట్టాడు. నేరాలు, ఘోరాలు చేయడం ఈయనకు అలవాటు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అణచివేసే కుట్రకు తీశారు. దీనికి తోడు బందిపోట్లకు మించిన దోపిడీ. ఇసుక, మైనింగ్, లిక్కర్, లాండ్ మాఫియాల రాజ్యం. ఎక్కడ చూసిన ప్రైవేట్ ఆర్మీ, మరొక వైపు పోలీసుల వత్తాసు. నిన్నటి వరకు సెటిల్ మెంట్లు జరిగాయి.

* డ్రైవింగ్ తెలియక రివర్స్ పాలన చేస్తున్న డ్రైవర్ జగన్*

ఈ దుర్మార్గులను తుదముట్టించి ప్రజాస్వామ్యం నిర్మాణం చేసే బాధ్యత కూటమిది. పరిపాలన తెలిసిన వాడు ఒక పద్దతి ప్రకారం సంక్షేమానికి తోడు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాని ఈ ముఖ్యమంత్రికి పరిపాలన చేతగాని దద్దమ్మ. డ్రైవర్ కి డ్రైవింగ్ తెలియకపోతే రివర్స్ గేర్ లో వెనక్కి వెళ్లినట్లు రాష్ట్రం రివర్స్ పాలన జరుగుతుంది. ఏ శాఖ అయినా పని చేస్తుందా? స్కూళ్లకు రంగులు కొడితే పిల్లలకు చదువు వస్తుందా? ఒక టీచర్ ని నియమించలేదు? టీచర్లను బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టాడు. విద్య విలువ తెలియని వ్యక్తి గురువును కూడా అవమానించారు.  రూ.13 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఆదాయం లేదు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే మేనిఫెస్టోపై చేతులు ఎత్తేశాడు. సంపద సృష్టిస్తే ఆదాయం వస్తుంది. నాడు నేను చేసిన అభివృద్ధిని అడ్డం పెట్టుకొని అప్పులు తెచ్చారు. ఇప్పుడు అప్పులు తెచ్చే పరిస్థితి లేదు.

*రాజధాని పేరు చెప్పలేని దౌర్బాగ్యం తెలుగు జాతిది*

జగన్ రూ.10 ఇచ్చి రూ.100 దోచేసుకుంటే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందా? ఎన్నికల మేనిఫోస్టో అధిరిపోయేలా ఇచ్చాం. అందరూ ఒక సారి చదవండి. అభివృద్ధి, సంక్షేమాలను ముందుకు తీసుకువెళ్లే సత్తా ఉన్న కూటమి. 2047కి దేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలని వికసిత్ భారత్ అనే కార్యక్రమంలో ఒక విజన్ తయారు చేశారు. నాడు గతంలో 2020 విజన్ తయారు చేశాను. నాడు నేను అనుకున్న పనులన్ని హైదరాబాద్ లో నెరవేరాయి. నేడు ఆ ప్రాంతం తెలంగాణకు ఉండిపోయింది. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మిస్తే తరువాత రాజశేఖర్ రెడ్డి ఏది కూల్చేయలేదు. కాని జగన్ ప్రజావేదిక కూల్చి అమరావతిని నాశనం చేశారు. అమరావతి పూర్తి అయ్యి ఉండి ఉంటే నేరుగా అక్కడకు వెళ్లి పనులు చక్కబెట్టుకోవచ్చు. సంక్షేమాన్ని పెంచే ఆదాయానికి అమరావతి సెంటర్ గా ఉండేది. చీరాల, బాపట్లలో పనుల కోసం హైదారబాద్, ఛైన్నైకి వెళ్లే దుస్తితి ఇప్పటికి ఉంది. రాజధాని పేరు చెప్పలేని దౌర్బాగ్యం తెలుగు జాతికి ఉంది. కృష్ణా డెల్టాలో నీళ్లు రాకపోతే పోలవరం ఆలస్యం అవుతుందని పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి ఒక నెల కంటే ముందు ఖరీఫ్ వేసేలా చేశాను. పట్టిసీమను నేను నిర్మించానన్న ధ్వేషంతో నీళ్లు ఉపయోగించుకోలేని దుర్మార్గుడు జగన్. అదే జగన్ చేసిన తప్పుడు పనులను సరి చేస్తాను కాని అతనిలా విధ్వంసం చేయను.

*ఆడబిడ్డలకు పుట్టిల్లు తెలుగుదేశం పార్టీ*

ఏ పని చేసినా ప్రజలకు ఉపయోగపడాలి. మే 13 ఎప్పుడెప్పుడు వస్తుందా? కూటమి అభ్యర్ధులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరూ కసి మీద ఉన్నారు. స్వేచ్ఛగా ఆలోచించి భవిష్యత్ ఓటు వేయండి. అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్లకు రిజర్వేషన్లు లేవని బాధపడేవారు. మొదటి సారిగా అగ్రవర్ణ పిల్లలకు 10 శాతం ఉద్యోగాలు రిజర్వ్ చేశాం.  ఏ వర్గంలో ఎక్కవ మందిలో వారికి ఎక్కువ వస్తాయి. టిడిపి ఆడబిడ్డలకు పుట్టిల్లు. ఆడబిడ్డలకు ఆస్థిలో సమాన హక్కు, విద్యకు ప్రాధాన్యం ఇచ్చింది ఎన్టీఆర్. డ్వాక్రా సంఘాలను పెట్టింది కూడా టిడిపినే. దీపంతో వంట గ్యాస్ సిలెండర్లు ఇచ్చాం. మరుగు దొడ్లు కట్టించాం. పసుపు కుంకుమ కింద రూ.10వేల కోట్లు ఇచ్చాం. డ్వాక్రా సంఘాల రుణాలు కొంత వరకు  మాఫీ చేశాం. అదే విధంగా ఇప్పుడు ప్రతి ఆడబిడ్డ 19 సంవత్సరాల పైబడిన వారికి నెలకు రూ.1,500 ఇస్తాం. సంవత్సారానికి రూ.18వేలు, ఐదేళ్లల్లో రూ.90వేలు ఆడబిడ్డల ఖాతాలో వేస్తాం.  ఇంట్లో ఎంత మంది ఉంటే అందరకి ఇస్తాం. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలుంటే అందరికి రూ.15వేలు ఇస్తాం. ముగ్గురుంటే రూ.45వేలు, నలుగురుంటే రూ.60వేలు ఇస్తాం. వివక్షత, కటింగ్ లు లేకుండా అందరికి ఇచ్చే బాధ్యత మాది. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. చేప ఇవ్వడం కాదు చేప పట్టుకొనే విధంగా నేర్పించి ఆడబిడ్డలు ఆర్ధికంగా పైకి తెచ్చే బాధ్యత తీసుకున్నాం. అందుకే ఆడబిడ్డలను శక్తివంతమైన ఆడబిడ్డలుగా, గౌరవం బ్రతికి విధంగా తయార చేసే బాధ్యత మాది.

*భూ చట్టాన్ని తెచ్చినందుకు ప్రజలందరికి జగన్ క్షమాపణలు చెప్పాలి*

జాబు రావాలంటే బాబు రావాలి. మేము రావాలంటే కూటమికి ఓటు వేయాలి. సైకోని ఇంటికి పంపించాలని అందరిలో కసి ఉంది. ఎండ ఉందని ఏమారితే కొంపలు కూలిపోతాయి. మొన్నటి వరకు బలవంతంగా సెటిల్ మెంట్లు చేసి ఆస్తులు రాసుకున్నారు. ఇప్పుడు కొత్తగా జగన్ ల్యాండ్ గ్రాబియింగ్ యాక్ట్ తీసుకువచ్చారు. మీరు ఓటు వేస్తే మీ ఆస్థి గోవిందా గోవిందా. ఇంతకముందు మీ ఆస్థి లాక్కోవడానికి బెదిరించేవాళ్లు ఇప్పుడు ఆ పని లేదా రికార్డు మార్పించేస్తారు. మీ భూమి పైన సైకో ఫోటో. మీకు జగన్ తాత భూమి ఇచ్చాడా? రేపటి నుంచి మీ భూమి మీ భూమి కాదు మనందరం ఆయన బానిసలం ఉండాల్సి వస్తుంది. భూ యాజమాన్య చట్టాన్ని ఎందుకు రద్దు చేయడం లేదు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డీఎస్సీ తరువాత జగన్ లాండ్ గ్రాబింగ్ చట్టం రద్దుపై సంతకం చేస్తాం. ఎన్నికల వచ్చాయి కాబట్టి ఇప్పుడు జగన్ ఏం చేయలేడు కనీసం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా సెంట్ కోసం ఊళ్లల్లో గొడవలు పడతాం. అలాంటిది ఎకరాలకు ఎకరాలు మాయం అవుతున్నాయి. ఒంటిమిట్టలో రికార్డులు తారుమారు చేస్తే కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. అత్యంత దురాసకి మొత్తం బలైపోయే పరిస్థితికి వచ్చారు.

*ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా*

యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది  సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఫిష్ మార్కెట్ లో ఉద్యోగాలు కాదు పెద్ద పెద్ద కంపెనీల్లో, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం. స్కిల్ సెంటర్లు పెట్టి మీకు స్కిల్ నేర్పించి ఉద్యోగాలు ఇస్తాం. చీరాలలో ఐటీ టవర్ కడతాం. చిన్న మద్య తరహా పరిశ్రమలకు రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తాం. సామాజిక పింఛన్లు అన్ని పెంచుతాం. బీసీలకు డిక్లరేషన్ తీసుకువచ్చాం. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం. పింఛన్ తెచ్చింది, పెంచింది టిడిపి. రూ.4వేల పింఛన్ పెంచింది ఏప్రిల్ నుంచి ఇస్తాం. జగన్ 2028కి రూ.250, 2029కి రూ.250 పెంచానని అంటున్నారు. కాని మేం ఏప్రిల్ నుంచే పెంచుతాం. అంటే జులైలో రూ.7ఇస్తాం. దివ్యాంగులకు రూ.6వేలు ఇస్తాం. పూర్తి కాళ్లు, చేతులు లేని వాళ్లకు రూ.15వేలు ఇస్తాం. కిడ్నీ, తలసేమియాతో బాధపడే వారికి రూ.10వేలు ఇస్తాం. చంద్రబీమా ద్వారా సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదశాత్తు చనిపోతే రూ.10 లక్షలు ఇస్తాం. ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తాం. వీటితో కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చు. డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తాం. బీసీ. షుగర్ ఉంటే ఉచిత మందుల సరఫరా చేస్తాం.

*టిడిపికి వెన్నుమొక, కంచుకోట బీసీలు*

బీసీ డిక్లరేషన్, జయహో బీసీ పెట్టాం. రూ.1.50 కోట్లు బడ్జెట్ పెడతాం.  సంవత్సరానికి రూ.30వేల కోట్లు, 50 ఏళ్లకే పింఛన్ ఇస్తాం. రూ.5 వేల కోట్లు ఆదరణ కింద ఆదునిక పని ముట్లు, రూ.10వేల కోట్లతో ఉపాధి కల్పిస్తాం. చేనేత కార్మికులకు పవర్ లూం ఉంటే 500 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తాం. హ్యాండ్ లూమ్ 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తాం. ప్రతి చేనేత కుటుంబానికి రూ.24వేలు ఆర్ధిక సాయం అందిస్తాం. జీఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ పెడతాం. మత్స్యకారులకు వేటకు వెళ్లని సమయంలో రూ.20వేలు సంవత్సరానికి ఇస్తాం. 217 జీవోను రద్దు చేస్తాం. నాయి బ్రాహ్మణులకు దేవాలయాల్లో పని చేస్తే రూ.20వేలు గౌరవ వేతనం ఇస్తాం, 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తాం. యాదవులకు అనేక పథకాలకు అందిస్తాం. పాడి రైతులకు దాణా, మందులు కొనుగోలు, గోకులాలు ఏర్పాటు చేస్తాం, మేతకు డబ్బులిస్తాం. అన్న క్యాంటీన్ తీసుకువస్తాం. మద్యాన్ని నియంత్రిస్తాం. విద్యుత్ చార్జీలు కంట్రోల్ చేస్తాం. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతాం. ఆక్వారైతులకు రూ.1.50 కరెంట్ ఇప్పిస్తాం. ఉచిత ఇసుక విధానం తెస్తాం. రైతన్నకు అన్నదాత కింద రూ.20వేలు ఇస్తాం.

*సంపద సృష్టించి పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచుతాం*

నియోజకవర్గంలో 2019లో టిడిపిపై అభిమానంతో ఏకపక్షంగా ఓట్లేసి గెలిపించారు. కాని అతను ఎక్కడున్నాడు? పనుల కోసం కక్కుర్తి పడే వాళ్లు రాజకీయాలకు అవసరమా? గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, పరుచూరి సాంబశివరావులకు ఇబ్బందులు ఉండవా? వాళ్లు అడ్డదారులు తొక్కలేదు. కాని ఇక్కడ గెలిచి అడ్డదారులు తొక్కుతున్నారు. అటువంటి మోసం చేసే వ్యక్తులకు గుణపాఠం చెప్పాలి.  ఆయారాం, గయారాంలు మనకు అవసరం లేదు. నిక్కచ్చిగా నష్టాన్ని, కష్టాన్ని తట్టుకున్న వాళ్లనే ప్రోత్సహిస్తాం కాని వెళ్లిపోయిన వ్యక్తులు మళ్లీ పార్టీలోకి వస్తే చేర్చుకోం.

*చీరాల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం*

ప్రతి గ్రామానికి తాగు నీటి సమస్య పరిష్కరిస్తాం. కుళాయి ద్వారా సురక్షిత మంచి నీరు ఇస్తాం. పంట కాలవలు రిపేర్ చేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారంటా? తోటవారి ఎత్తిపోతల పథకానికి కృష్ణ నీరు అందిస్తాం.వ్యాపారస్థులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. వైకుంఠపురం రైల్వే బ్రిడ్జ్, పేరాల రైల్వే బ్రిడ్జ్ నిర్మిస్తాం.  చేనేతలను ప్రోత్సహిస్తాం. టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. సముద్రమే పొంగి ఇక్కడకు వచ్చిందా అన్న సందేహం కలుగుతుంది. మే 13న తిరుగుబాటుగా తయారయ్యి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళఖాతంలో కలిపేసి మన భవిష్యత్ ని మళ్లీ ముందుకు తీసుకుపోవాలి.

Also read

Related posts

Share via