July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

కల్తీ మద్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లక్షల మంది ప్రాణాలు తీసి ఆడబిడ్డల ఉసురు పోసుకున్నారు….

*మచిలీపట్నం*
*13/04/2024*

*కల్తీ మద్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లక్షల మంది ప్రాణాలు తీసి ఆడబిడ్డల ఉసురు పోసుకున్నారు…..*

*డ్రగ్స్ కు మన రాష్ట్రాన్ని కేరాఫ్ గా మార్చిన జగన్మోహన్ రెడ్డికి ఓటు అనే ఆయుధంతో మహిళలు బుద్ధి చెప్పాలి….*

*వాలంటీర్లకు అండగా నిలబడేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అని వాలంటీర్లు గ్రహించాలి…. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్, దేవరపల్లి అనిత, తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి, పాలపర్తి పద్మజ…*

*తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం కార్యాలయంలో శనివారం తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్, దేవరపల్లి అనిత, తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగం జిల్లా అధికార ప్రతినిధి, పాలపర్తి పద్మజ, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం మచిలీపట్నం నియోజకవర్గం ఉపాధ్యక్షురాలు, మద్దాల లక్ష్మీ నాంచారమ్మ లు నిర్వహించిన పాత్రికేయుల సమావేశం వివరాలు….*

జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యంతో రాష్ట్రంలో లక్షల మంది ప్రాణాలు పోయాయి అన్నారు. ప్రజల ప్రాణాలను తీసి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో లక్షల కోట్లను దోచుకున్నాడని మండిపడ్డారు.

దోచుకున్న డబ్బులు తాడేపల్లి ప్యాలస్ నుండి కంటైనర్లలో ఎన్నికల కోసం తరలిస్తూ బయటపడింది వాస్తవం కాదా అన్నారు.

కల్తీ మద్యం అమ్మి ఆడబిడ్డల తాళిబొట్లు తెంపుతున్న జగన్ మోహన్ రెడ్డికి ఓటు అనే ఆయుధంతో వచ్చే ఎన్నికలలో మహిళలు బుద్ధి చెప్పాలి అన్నారు.

కల్తీ మద్యం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులకు ఆదాయ వనరుగా మారిందని, రాష్ట్ర ప్రజలు మాత్రం కల్తీ మద్యంతో అనారోగ్యాలకు గురవుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

2019 ఎన్నికల ముందు మధ్య నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి, మద్యాన్ని ఆదాయ వనరుగా జగన్మోహన్ రెడ్డి మార్చుకోవడం సిగ్గుచేటు అన్నారు.

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించక పోగా,
కల్తీ మద్యం, గంజాయితో రాష్ట్రంలో యువత భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

2014… 2019 లలో మద్యం ఆదాయం ఎంత? మద్యం నిషేధం అని జగన్ చెప్పాక నేటి పరిస్థితి ఏంటో ప్రజలు గమనించాలి అన్నారు.

దశల వారి మద్యం నిషేధం అన్న తర్వాత రాష్ట్రంలో ఎక్సైజ్ మరియు వ్యాట్ ఆదాయం క్రమము గా తగ్గకుండా పెరగడం దౌర్భాగ్యం అన్నారు.

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి, సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, మన అధినాయకత్వం నిర్దిష్టమైన చక్కటి ప్రణాళికలను రూపొందించారు అన్నారు.

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ల విద్యార్హతలు, ప్రతిభకు తగిన ఉద్యోగాలు కల్పించి, వాలంటీర్లకు పదివేల రూపాయల జీతం ఇచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు అండగా ఉంటుందని, వైసీపీ నాయకుల ఉచ్చులో పడి వాలంటీర్లు ఈ ఎన్నికలలో వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నగర కార్పొరేషన్, ప్రధాన కార్యదర్శి, పిప్పళ్ళ వెంకట కాంతారావు, తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా ప్రచార కార్యదర్శి, పి. వి. ఫణి కుమార్, తెలుగుదేశం పార్టీ 50వ డివిజన్ ఇన్చార్జి, పడమట నాగరాజు, 50వ డివిజన్ తెలుగు యువత నాయకుడు, మద్దాల వికాస్ తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via