SGSTV NEWS
CrimeTelangana

HYD Crime: హైదరాబాద్‌లో దారుణం.. బాత్రూం బల్బ్‌లో సీసీ కెమెరా పెట్టించిన ఓనర్.. అసలేమైందంటే?


హైదరాబాద్‌లో ఓ ఇంటి ఓనర్ దారుణానికి పాల్పడ్డాడు. అద్దెకు ఉంటున్న ఇంట్లో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసి వివాహిత వీడియోలను రికార్డు చేశాడు. భర్త గుర్తించి ఓనర్ మీద డౌట్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఇంటి ఓనర్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

హైదరాబాద్‌లో ఓ ఇంటి ఓనర్ దారుణానికి పాల్పడ్డాడు. అద్దెకు ఉంటున్న ఇంట్లో సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసి వివాహిత వీడియోలను రికార్డు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మధురానగర్‌లోని జవహార్ నగర్‌లోని ఓ ఇంట్లో భార్యాభర్తలు అద్దెకు దిగారు. దీంతో అద్దెకు ఉంటున్న వారి బాత్రూంలో ఓనర్ సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేశాడు. వివాహిత వీడియోలను రికార్డు చేశాడు. ఈ నెల 4న బాత్రూంలో బల్బ్ రిపేర్ చేయించాడు.

ఎలక్ట్రీషియన్‌తో కలిసి..
ఆ సమయంలో ఎలక్ట్రీషియన్ చింటుతో కలిసి బల్బ్ హోల్డర్‌లో కెమెరాను అమర్చాడు. ఈ నెల 13న భర్త ఆ సీసీ కెమెరాను గుర్తించాడు. ఓనర్ ప్రవర్తనపై అనుమానం రావడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఇంటి ఓనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎలక్ట్రీషియన్ చింటు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే ఎలక్ట్రీషియన్‌పై కేసు పెట్టకుండా ఇంటి యజమాని అశోక్‌ యాదవ్ అడ్డుపడ్డాడు.

Also read

Related posts