April 16, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Crime news: రెండోసారీ ఆడపిల్ల పుట్టిందని అమానుషం

ఆడబిడ్డగా జన్మించడమే ఆ చిన్నారి చేసిన ‘పాప’మైంది. అనారోగ్యం పాలై.. చికిత్స అందక.. పుట్టిన రెండు నెలలకే ప్రాణాలు విడిచింది.


సింగరాయకొండ : ఆడబిడ్డగా జన్మించడమే ఆ చిన్నారి చేసిన ‘పాప’మైంది. అనారోగ్యం పాలై..చికిత్స అందక.. పుట్టిన రెండు నెలలకే ప్రాణాలు విడిచింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి, నాన్నమ్మ, తాతయ్య కర్కశంగా వ్యవహరించడంతో బందీగా మారి బలైపోయింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 15 రోజుల క్రితం ఈ దారుణ సంఘటన చోటుచేసుకోగా స్థానిక పోలీసుల నిర్లక్ష్యం.. నాయకుల ఒత్తిడి కారణంగా ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సీఐ హజరత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాయకొండలోని డ్రైవరుపేటకు చెందిన షేక్ సందానీబాషాకు.. పాకలకు షేక్ రషీ దాతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. ఏడాది తర్వాత వీరికి ఆడపిల్ల పుట్టింది. అప్పటి నుంచి భర్త, అత్తమామలు రషీ దాను వేధించడం మొదలుపెట్టారు. ఈ ఏడాది జులై 31న ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలలో రషీదా మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వేధింపులు తారస్థాయికి చేరాయి.
ఈ క్రమంలో పుట్టినబిడ్డ రెండు నెలల కిందట అనారోగ్యం పాలైంది. స్థానిక వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లాలని సూచించారు. భర్త, అత్తమామలు ఆ పాపకు వైద్యం అందించకుండా ఇంటి వద్దనే ఓ గదిలో తల్లి కుమార్తెలను బంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో సెప్టెంబరు 26న శిశువు చనిపోయింది. అక్టోబరు 3న బాధితురాలు పోలీస్టేషన్లో భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 5న భర్త సందానీబాషా, మామ మెహబూబ్ బాషా, అత్త సుల్తాన్బీలను అరెస్టు చేశారు.

Also read

Related posts

Share via