SGSTV NEWS
Andhra PradeshCrime

AP Crime : నా చావుకు తిరువూరు ఎమ్మెల్యే కొలి కపూడి శ్రీనివాసరావే కారణం…ఇరిగేషన్ ఏఈఈ లేఖ వైరల్


నా చావుకు జలవనరుల శాఖ ఈఈ గంగయ్య, డీఈఈ ఉమాశంకర్, ఈఎన్సీ బి. శ్యామ్ ప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలి కపూడి శ్రీనివాసరావులే కారణం. అంటూ  ఆత్మహత్య లేఖ రాసి జలవనరుల శాఖ ఉద్యోగి కిశోర్ అదృశ్యం కావడం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరువూరులో కలకలం రేపింది.


AP Crime :  “నా చావుకు జలవనరుల శాఖ ఈఈ గంగయ్య, డీఈఈ ఉమాశంకర్, ఈఎన్సీ బి. శ్యామ్ ప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలి కపూడి శ్రీనివాసరావులే కారణం. అంటూ  ఆత్మహత్య లేఖ రాసి జలవనరుల శాఖ ఉద్యోగి కిశోర్ అదృశ్యం కావడం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరువూరులో కలకలం రేపింది.


జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం, అనిగిళ్ళపాడు గ్రామానికి చెందిన కిషోర్ తిరువూరు నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్ (AE)గా పనిచేస్తున్నారు. అయితే —తనకు బదిలీ అయినా రిలీవ్ చేయడం లేదంటూ మనస్తాపం చెందిన కిశోర్‌ — ఇరిగేషన్ వాట్సప్ గ్రూప్‌లో లెటర్ పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అదృశ్యమయ్యాడు. తన మరణానికి MLA కొలికపూడి, ఇరిగేషన్ ఈఈ గంగయ్య..డీఈఈ ఉమాశంకర్, ఈఎన్సీబీ శ్యామ్ ప్రసాద్ కారణం అంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు.

— కొద్దిరోజుల క్రితం గౌరవరంకు కిశోర్ బదిలీ అయినట్లు తెలిసింది. అయితే  బదిలీ ఆపేలా ఉన్నతాధికారులపై ఎమ్మెల్యే కొలికపూడి ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ‘నాకు జలవనరుల శాఖ సాధారణ బదిలీల్లో ఎన్ఎస్సీ ఓ అండ్ ఎం గౌరవరం సెక్షన్ కు బదిలీ అయింది. ఈఈ, డీఈఈ, ఈఎన్సీ… ఎమ్మెల్యే కొలికపూడితో కలిసి బదిలీ ఆపేలా రాజకీయం చేశారు. మా మామయ్య పార్టీ నాయకుడని జగ్గయ్యపేట ఎమ్మెల్యే తాతయ్య.. ఈఎన్సీకి చెప్పినా ఫలితం లేకపోయింది. ఒక దళిత ఉద్యోగిగా నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. సీనియర్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్, మంత్రి పీఏ బొట్టు శ్రీనివాసరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని’ కిశోర్‌ లేఖలో రాశారు.



లేఖపై రక్తపు మరకలను పోలిన ఎర్రటి మరకలు ఉండడంతో కిశోర్ అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కిశోర్‌ గత నెలలోనే బదిలీ కావడంతో స్థానికంగా అద్దెకు ఉండే ఇల్లు కూడా ఖాళీ చేశారు. శుక్రవారం ఉదయం ఏఈఈ కిశోరును ఆయన మామయ్య తన కారులో దించి వెళ్లినట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం 2.45 గంటలకు కిశోర్‌ తన కార్యాలయం నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్లారు.  లేఖను చూసి అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు తిరువూరు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. చివరిసారిగా ఖమ్మం జిల్లా పెనుబల్లిలో కిశోర్ లోకేషన్ ట్రేస్ అయినట్లు తెలుస్తుంది.ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేశారు. ఆత్మహత్య లేఖలో కిశోర్ పేర్కొన్న పేర్లను అతని మామయ్య ఆనందరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు

Also read

Related posts

Share this