December 18, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఇంటర్ విద్యార్థిని.. ఆ తర్వాత ఏం చేసిందంటే?


ఏలూరులో ఇంటర్ చదువుతున్న ఓ మైనర్ బాలిక హాస్టల్‌లో ఆడ శిశువుకి జన్మనిచ్చింది. ఆ పసికందును హాస్టల్ నుంచి వేరే ఇంట్లోకి పడేయడంతో మరణించింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని విచారించారు. ఇది కూడా చదవండి………Crime: లోన్ యాప్స్ ఎఫెక్ట్.. యువతి ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏలూరులో షాకింగ్ ఘటన జరిగింది. ఇంటర్ విద్యార్థిని అయిన ఓ 17 ఏళ్ల బాలిక హాస్టల్‌లో పసికందుకు జన్మనిచ్చింది. ఏలూరులోని అశోక్ నగర్‌లోని హాస్టల్‌లో చదువుతున్న ఓ మైనర్ బాలిక బాత్‌రూమ్‌లో ఆడ శిశువుకి జన్మనిచ్చింది. ఆ తర్వాత బాత్రూమ్ అన్ని క్లీన్ చేసి, హాస్టల్ పై నుంచి శిశువుని విసిరేసింది. దీంతో ఆ శిశువు పక్కింట్లో పడింది. ఎత్తు నుంచి పడటంతో ఆ పసికందు మరణించింది. దీనికి సంబంధించి కాల్ రావడంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తొమ్మిది నెలల గర్భిణి అయిన..
అశోక్ నగర్‌ సమీపంలో ఓ కాలేజీలో చదువుతున్న బాలిక బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. గత రెండేళ్ల నుంచి ఆ బాలిక హాస్టల్‌లో ఉంటోంది. తొమ్మిది నెలల గర్భవతి అయిన కూడా ఇప్పటి వరకు ఆ బాలికను గుర్తించకుండా ఎలా ఉన్నారని హాస్టల్ యాజమాన్యాని విచారిస్తున్నారు. హాస్టల్‌లో విద్యార్థుల అడ్మిషన్, మెడికల్, మెయింటెన్స్ వంటి రికార్డులు కూడా లేవు.

ఇదిలా ఉండగా ఇటీవల నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలిక తన ఇంటి దగ్గర ఆటుకుంటుంది. అదే సమయంలో అటువైపుగా వచ్చిన 36 ఏళ్ల బొమ్మెన సాగర్ ఆ చిన్నారిపై కన్నేసాడు. చుట్టూ ఎవరూ లేకపోవడంతో ఆ చిన్నారికి మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు.

అక్కడ ఆ చిన్నారిపై అత్యాచారం చేసి పంపించేశాడు. దీంతో ఆ బాలిక ఏడ్చుకుంటూ ఇంటికెళ్లి జరిగిందంతా తన తల్లికి చెప్పింది. వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

Also Read

Related posts

Share via