• పది రోజుల క్రితం తిరుపతిలో ఘటన
• తల్లిదండ్రుల్ని చంపేస్తానని బెదిరించడంతో ఎవరికీ చెప్పని బాలిక
• అనారోగ్యంబారిన పడటంతో ఆలస్యంగా వెలుగుచూసిన వైనం
తిరుపతి : ఎనిమిదేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి
లైంగిక దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఎంఆర్పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి బాలాజీ నగర్లోని కాలేజీలో చదువుకుంటూ అక్కడికి దగ్గర్లో ఉన్న అమ్మమ్మ ఇంట్లో ఉండేవాడు. వీరి ఇంటికి సమీపంలోనే బాలిక కుటుంబం నివసిస్తోంది. పదో తరగతి చదువుతున్న బాలిక అన్నతో సన్నిహితంగా ఉంటూ వారింటికి వచ్చిపోతూ ఉండేవాడు
పది రోజుల కిందట బాలికకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే మీ అమ్మానాన్నల్ని చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. అలా బెదిరిస్తూ నాలుగుసార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలి- కకు జ్వరం, కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. లైంగికదాడి జరిగినట్లు వైద్యులు గుర్తించడంతో తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా విష- యం చెప్పింది.
దీంతో తల్లిదండ్రులు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదుచేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా నగరంలో నివసించే రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో నిందితుడి అమ్మమ్మ పనిచేస్తుండటంతో అతను పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు. బాలిక బంధువులు, కుటుంబీకులు దాడిచేసేందుకు . ప్రయత్నించడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.
Also read
- Auspicious Yogas: ఈ నెల 21న అరుదైన యోగాలు.. దీర్ఘాయువు, ఆయుస్సు కోసం ఎలా పుజించాలంటే..
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!