April 14, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

తాడేపల్లిగూడెంలో ఇండియన్ ఆయిల్ సిబ్బంది దౌర్జన్యం



పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని పవన్ మెస్ పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ సిబ్బంది దౌర్జన్యం

పెట్రోల్, డీజిల్ కొట్టించుకునేందుకు వచ్చిన కస్టమర్లతో దారుణ పదజాలంతో దూషిస్తూ దాడులకు తెగబడుతున్న పెట్రోల్ బంక్ సిబ్బంది




ఒక మోటారు వెహికల్ పై వచ్చిన వ్యక్తి పెట్రోల్ కొట్టించుకుని ఫోన్ పే చెయ్యగా అది పనిచేయకపోతే ఇంటికి వెళ్లి తీసుకువస్తా ఎవరైనా కూడా రావాలని చెప్పడంతో బండి లాక్కొని దౌర్జన్యానికి తెగబడిన పెట్రోల్ బంకు గుమాస్తాలు, సిబ్బంది

ఇదేమని గట్టిగా నిలదీస్తే పెట్రోల్ బంక్ సిబ్బంది దుర్భాషలాడటంతో ఎదురుతిరిగిన కస్టమర్

దీంతో సిబ్బంది, కస్టమర్ మధ్య చోటుచేసుకున్న తోపులాట

దీంతో కస్టమర్ ను సిబ్బంది ఆఫీస్ లోపలికి తీసుకువెళ్లి దాడి చేసి కొట్టినట్లు వాపోతున్న బాధితుడు

వారి తప్పు కప్పిపుచ్చుకుంటూ కస్టమర్ దే తప్పంటూ ఏకపక్షంగా పోలీసులకు సమాచారమిచ్చిన పెట్రోలు బంకు నిర్వహకులు

పోలీసులు కనీసం అక్కడ జరిగిన విషయం పూర్తిగా విచారించకుండా కస్టమర్ నే బలవంతంగా పోలీస్టేషన్ కు తరలించడంపై వెల్లువెత్తుతున్న విమర్శలు

ఇటు కస్టమర్ అటు సిబ్బందిని పోలీస్టేషన్ కు తీసుకువెళ్ళకుండా కేవలం కస్టమర్ నే బలవంతంగా పోలిస్టేషన్ కు తరలించడంపై ఆంతర్యం ఏంటనేది అర్ధం కావడం లేదని బాధితుడు వాపోతున్న వైనం

ఇది ఇలా ఉంటే ఈ ఘటన జరిగిన నిముషాలు వ్యవధిలో ఇదే కోవాలో మరో కస్టమర్ పై ఇదే కోవాలో దుర్భాషలాడిన పెట్రోల్ బంకు సిబ్బంది

దీంతో సదరు కస్టమర్ పై పెట్రోల్ బంకు సిబ్బంది నోటికి వచ్చినట్లు దుర్భాషలాడటంపై నిలదీసిన అదే కస్టమర్

కస్టమర్లపై దుర్భాషలాడుతూ తప్పు అదే కస్టమర్లపై నెడుతూ తప్పులు మీద తప్పులు చేస్తున్న సదరు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధిత కస్టమర్లు, ప్రజలు

తక్షణమే రెండు వైపులా పూర్తి విచారణ జరిపి పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధితులు, ప్రజలు

Also read

Related posts

Share via