November 21, 2024
SGSTV NEWS
CrimeNational

భర్త ముందే దారుణం.. ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు బైక్ పై వెళుతుండగా..

ఒక ద్విచక్రవాహనం మరో బైక్ ను ఢీకొట్టింది.. దీంతో దీనిపై ఇద్దరు బైకర్ల వాగ్వాదం మొదలైంది.. అది కాస్త చూస్తుండానే చినికిచినికి గాలి వానలా మారి చంపుకునే స్థాయికి చేరుకుంది.. నిందితుడు మహిళపై కాల్పులు జరపగా.. ఆమె అక్కడికక్కడే మరణించింది.. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఒక ద్విచక్రవాహనం మరో బైక్ ను ఢీకొట్టింది.. దీంతో దీనిపై ఇద్దరు బైకర్ల వాగ్వాదం మొదలైంది.. అది కాస్త చూస్తుండానే చినికిచినికి గాలి వానలా మారి చంపుకునే స్థాయికి చేరుకుంది.. నిందితుడు మహిళపై కాల్పులు జరపగా.. ఆమె అక్కడికక్కడే మరణించింది.. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.. ఈశాన్య ఢిల్లీలోని గోకల్‌పురిలో బుధవారం ఒక వ్యక్తి.. నలుగురు సభ్యుల కుటుంబంపై కాల్పులు జరపగా.. 30 ఏళ్ల మహిళ మరణించింది.. తమ వాహనాలు ఒకదానికొకటి స్వల్పంగా కొట్టుకోవడంతో ఇద్దరు బైక్ డ్రైవర్ల మధ్య జరిగిన చిన్న వాగ్వాదం.. చంపుకునే వరకు వెళ్లినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం.. నిందితుడు బుల్లెట్ మోటార్‌సైకిల్‌పై వెళుతున్న కుటుంబంపై ఒక రౌండ్ కాల్పులు జరపగా.. బుల్లెట్ మహిళకు తాకిందని పోలీసులు తెలిపారు

Also read :AP News: గనుల శాఖ పూర్వ డైరెక్టర్‌ వెంకటరెడ్డిపై వేటు.. ఏసీబీ విచారణకు ఆదేశం
వజీరాబాద్ రోడ్డులోని గోకల్‌పురి ఫ్లైఓవర్ సమీపంలో మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హీరా సింగ్ (40) తన భార్య సిమ్రంజీత్ కౌర్ (30), 2, 12 సంవత్సరాల ఇద్దరు కుమారులతో కలిసి తన మోటార్‌సైకిల్‌పై వెళుతున్నాడు.. ఈ క్రమంలో ఫ్లైఓవర్ సమీపంలో వారి బైక్ ను మరొక ద్విచక్ర వాహన దారుడు వారి బైక్ ను ఢీకొట్టాడు.. అనంతరం ఇద్దరు బైకర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగిందని పోలీసులు తెలిపారు

ఇరువురు పరస్పరం దూషించుకున్నారు. నిందితుడు స్కూటర్ రైడర్ ఫ్లైఓవర్‌పైకి వెళ్లగా, సింగ్ ఫ్లైఓవర్ పక్కనే రోడ్డుపై మౌజ్‌పూర్ వైపు వెళ్లడం వరకు వాగ్వాదం కొనసాగింది. అనంతరం నిందితుడు తమపై 35 అడుగుల దూరంలో ఉన్న ఫ్లైఓవర్ నుంచి ఒక్కసారిగా కాల్పులు జరిపాడని సింగ్ పోలీసులకు తెలిపారు.

బుల్లెట్ నేరుగా అతని భార్య మెడకు తగిలిందని, ఆమె తీవ్రంగా గాయపడిందని.. తరువాత ఆమెను సమీపంలోని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారని పోలీసులు తెలిపారు.

Also read :తన కారుకు అడ్డొచ్చాడని వీరంగం చూపించిన ఎస్‌ఐ.. బండారం బయటపెట్టిన నిఘా నేత్రం!

కాల్పుల జరిపిన అనంతరం నిందితుడు బైకర్ అక్కడి నుంచి పారిపోగా, అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి హత్య కేసు నమోదు చేశామని.. క్రైమ్ స్పాట్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Also read :భార్య చేసిన పని జల సమాధి అయిన భర్త! ఏం జరిగిందంటే..

Related posts

Share via