June 26, 2024
SGSTV NEWS
CrimeUttar PradeshViral

Wedding: మరికాసేపట్లో పెళ్లి.. స్టేజ్ వెనుకాలనే ఆ పనిచేస్తూ దొరికిన వరుడు.. ఆ అమ్మాయి ఏం చేసిందంటే..

  • పెళ్లి వేడుక అంటేనే సందడే.. సందడి.. అందరూ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకునేలా ప్లాన్ చేసుకుంటారు.. అయితే.. పెళ్లి వేడుకల్లో ఎన్నో ఘటనలు చూస్తుంటాం.. గొడవలు.. డ్యాన్స్‌లు.. కొట్లాటలు.. అలకలు.. ఇవన్నీ తెరపైకి వస్తుంటాయి.. వాటిని పెద్దగా పట్టించుకోరు.. అయితే.. ఇక్కడ అలాంటిది కాదు.. దానికి మించిన ఘటన చోటుచేసుకుంది.. సరిగ్గా వివాహ తంతు జరిగే సందర్భంలో వరుడి బాగోతం చూసి.. వధువు షాకింగ్ నిర్ణయం తీసుకుంది.. పెళ్లి వద్దు అంటూ తెగేసి చెప్పింది.. ఎవ్వరూ బ్రతిమలాడినా కానీ.. పెళ్లి మాత్రం అతన్ని చేసుకోను అంటూ ఖరాకండిగా చెప్పేసింది.. ఇంతకు ఏం జరిగింది.. ఎంటీ..? అనే వివరాలను తెలుసుకోండి.. పెళ్లి జరుగుతుండగా.. వరుడు ఉన్నట్టుండి స్టేజీ వెనుక వైపు వెళ్లాడు. కాసేపటికి అనుమానం వచ్చి వధువు చూడటానికి అటుగా వెళ్లింది.. అక్కడ వేరే దశ్యం కనిపించింది. వరుడు మద్యం, గంజాయ్ తాగుతూ.. దుర్భాషలాడుతూ కనిపించాడు.. దీంతో వధువు ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది..

 

 

వివాహ వేడుకలో వరుడు మత్తులో దుర్భాషలాడుతూ, గంజాయి తాగుతున్నాడని వధువు వివాహం చేసుకోవడానికి నిరాకరించిందని భదోహి పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం వివాహం జరగాల్సి ఉండగా.. బుధవారం రాత్రి వరుడు తన బంధువులతో గ్రామానికి చేరుకున్నారు. ఈ సమయంలో వరుడు మద్యం మత్తులో ఉన్నాడని.. స్టేజీ ఎక్కి అందరినీ దూషించాడని వధువు కుటుంబసభ్యులు తెలిపారు. అనంతరం పెళ్లి తంతులో.. వరుడు అకస్మాత్తుగా స్టేజీ వెనుకకు వెళ్లి.. గంజాయ్ తాగుతూ కనిపించాడు.. అది చూసిన వధువు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని పోలీసులు తెలిపారు.

 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. ఈ క్రమంలో వధువు తరపు వారు వరుడు, వారి కుటుంబసభ్యులను బందీలుగా ఉంచి పెళ్లికి ఖర్చు చేసిన రూ.8 లక్షలు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Related posts

Share via