SGSTV NEWS
CrimeInternational

Nimisha Priya Case: కేరళ నర్స్‌ ఉరిశిక్ష రద్దు ఎపిసోడ్‌లో ట్విస్ట్‌… ఉరిశక్ష రద్దును ధృవీకరించని ప్రభుత్వవర్గాలు…





యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ ఇది. హత్య కేసులో నిమిష ప్రియకు ఉరిశిక్ష రద్దు చేసేందుకు యెమెన్‌ ప్రభుత్వం అంగీకరించిందని వార్తలు వచ్చాయి. అయితే ఉరిశక్ష రద్దును ప్రభుత్వవర్గాలు ధృవీకరించలేదు. ఈ వార్తలు సరికావంటుని విదేశాంగ శాఖ అధికారులు అంటున్నారు. నిమిష ప్రియ…

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ ఇది. హత్య కేసులో నిమిష ప్రియకు ఉరిశిక్ష రద్దు చేసేందుకు యెమెన్‌ ప్రభుత్వం అంగీకరించిందని వార్తలు వచ్చాయి. అయితే ఉరిశక్ష రద్దును ప్రభుత్వవర్గాలు ధృవీకరించలేదు. ఈ వార్తలు సరికావంటుని విదేశాంగ శాఖ అధికారులు అంటున్నారు. నిమిష ప్రియ మరణశిక్షను రద్దయినట్లు భారత గ్రాండ్ ముఫ్తీ కాంతపురం అబూబకర్ ముస్లియార్ ఆఫీస్‌ సోమవారం ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి.

వాస్తవానికి జూలై 16 నే నిమిష ప్రియకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా.. భారత ప్రభుత్వ విజ్ఞప్తితో అది వాయిదా పడింది. అప్పట్నుంచి యెమెన్‌ అధికారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతూ కేసు పరిష్కారానికి ప్రయత్నించింది. భారత గ్రాండ్‌ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు సూఫీ పెద్ద షేక్‌ హబీబ్‌.. సున్నీ లీడర్‌ అబూబకర్‌ కలిసి యెమెన్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ పరిస్థితుల్లో అత్యున్నత సమావేశంలో మతపెద్దలు తీసుకున్న చొరవతో ఉరిశిక్ష రద్దు అయినట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను విదేశాంగశాఖ వర్గాలు తోసిపుచ్చాయి.

కాగా, కేరళకు చెందిన నిమిష ప్రియ వృత్తి రీత్యా న‌ర్సు. యెమెన్ దేశీయుడైన త‌లాల్ అబ్దో మ‌హ‌దీతో క‌లిసి ఆ దేశంలోనే క్లినిక్ ప్రారంభించింది. కానీ.. ఇద్దరి మ‌ధ్య విబేధాలు రావ‌డంతో అత‌డు నిమిష‌పై వేధింపుల‌కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో.. మ‌రో వ్యక్తితో క‌లిసి అత‌డికి నిమిష‌ మ‌త్తు మందు ఇవ్వగా డోస్ ఎక్కువై మ‌ర‌ణించారు. ఈ కేసులో ఆమెకు యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో ఉరిశిక్ష నుంచి నిమషను తప్పించేందుకు భార‌త్ ప్రయ‌త్నిస్తుంది.

Also read

Related posts

Share this