July 1, 2024
SGSTV NEWS
CrimeNational

Kota Student Suicide: కోటాలో మరో విద్యార్ధి మృతి.. భవనంపై నుంచి దూకి సూసైడ్! నీట్‌ యూజీ ఫలితాలే కారణమా?





కోటా, జూన్‌ : కోచింగ్ హబ్‌ రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ ఏడాది సూసైడ్‌ చేసుకున్న విద్యార్ధుల సంఖ్య 11కు చేరింది.నీట్ యూజీ 2024 ఫలితాలు విడుదలైన ఒక రోజు తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు సాయంత్రం యువతి భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుని తనువు చాలించింది. వివరాల్లోకెళ్తే..


రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా ఇప్పటికే అక్కడ వివిధ కోచింగ్ సెంటర్లలో కోచింగ్‌ తీసుకుంటున్న పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలించారు. ఈ క్రమంలో తాజాగా మరో విద్యార్థి తనువు చాలించింది. మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన బగీషా తివారీ (18) అనే యువతి తల్లి, సోదరుడితో కలిసి కోటాలోని జవహర్‌ నగర్‌ ప్రాంతంలో నివాసం ఉంటోంది. అక్కడే స్థానికంగా కోటాలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (యూజీ)కు కోచింగ్‌ తీసుకుంటోంది. ఈ నెల 4 (మంగళవారం) నీట్‌ యూజీ ఫలితాలు వెడువడ్డాయి. ఫలితాలు వెలువడిన ఒకరోజు తర్వాత అంటే బుధవారం సాయంత్రం యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

తాము ఉంటున్న భవనంపై నుంచి దూకి విద్యార్ధిని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహారావ్‌ భీమ్‌ సింగ్‌ ఆసుపత్రికి తరలించారు. ఆమె తండ్రి కోటకు వచ్చిన తర్వాత పోలీసులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఈ మేరకు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థి మృతికిగల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా తాజా ఘటనతో ఈ ఏడాది కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 11కు చేరింది. గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్థులు సూసైడ్‌ చేసుకుని మరణించారు. కోటాలో వెలుగు చూస్తున్న వరుస దారుణాలు విద్యార్ధుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.

Also read

Related posts

Share via