పట్టపగలు.. అందరూ చూస్తుండగా.. నడిరోడ్డుపై యువతి దారుణంగా హత్యకు గురైంది. ఓ కిరాతకుడు తన మాజీ ప్రియురాలిని ఇనుప స్పాపర్‌తో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని ముంబైకి సమీపంలో పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో చోటు చేసుకుంది. యువతిని కొట్టి చంపుతున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్
ముంబై, జూన్ 19: పట్టపగలు.. అందరూ చూస్తుండగా.. నడిరోడ్డుపై యువతి దారుణంగా హత్యకు గురైంది. ఓ కిరాతకుడు తన మాజీ ప్రియురాలిని ఇనుప స్పాపర్‌తో కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని ముంబైకి సమీపంలో పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో చోటు చేసుకుంది. యువతిని కొట్టి చంపుతున్న దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే..
ముంబై సమీపంలోని పాల్ఘర్ జిల్లాలోని వాసాయికి చెందిన ఆర్తి (22), రోహిత్ (29) అనే ఇద్దరు గత ఆరు సంవత్సరాలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఆర్తి, రోహిత్ కొన్ని కారణాల రిత్య విడిపోయారు. దీంతో ఆమెపై కక్ష్య పెంచుకున్న రోహిత్ అదును కోసం వేచిచూశాడు. ఈ క్రమంలో ఇటీవల రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న ఆర్తిపై రోహిత్ దాడి చేశాడు. పరిశ్రమల్లో వాడే స్పానర్‌ని తనతో తెచ్చుకున్న రోహిత్ ఆమె తలపై 18 మార్లు కొట్టడంతో, యువతి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. మహారాష్ట్ర కొంకణ్ తీరంలోని వాసా నగరం చిన్చ్‌పాడా ప్రాంతంలో మంగళవారం ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే సంఘటన సమయంలో చుట్టూ ఉన్నవారు చూస్తున్నారేగానీ.. అతడిని ఆపే ప్రయత్నం ఎవరూ చేయకపోవడం గమనార్హం. పైగా ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరిస్తూ చూస్తూ ఉండిపోయారు.
https://x.com/AduriBhanu/status/1803327550246035926?t=6l351OY_xv-c1bg59KC1dA&s=19
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, వలీవ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కొద్దికాలంగా ఆ యువతి మరొక వ్యక్తికి దగ్గరవ్వటంతో పగ పెంచుకున్న రోహిత్ యాదవ్ ఈ దాడికి తెగబడినట్టుగా స్థానిక పోలీసులు చెబుతున్నారు. దాడి ఘటనను అడ్డుకోకుండా, స్మార్ట్‌ఫోన్లలో వీడియో తీసి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటాన్ని పోలీసులు తప్పుబట్టారు. కాగా ఇటీవలి కాలంలో ముంబై మహానగరంలో ఇలాంటి దారుణ ఘటనలు వరుసగా చోటుచేసుకున్నాయి. తాజాగా ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టినట్లు సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జైరామ్ రాన్‌వేర్ మీడియాకు తెలిపారు.