November 21, 2024
SGSTV NEWS
CrimeNational

ఓరి మీ మొహాలు మండ.. పోస్టాఫీసుకు పార్సిల్.. ఏముందా అని ఆరా తీయగా

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. రోజుకో చోట గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడుతూనే ఉన్నారు.. అయితే.. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రకరకాల ప్లాన్‌లతో స్మగ్లింగ్ చేస్తున్నారు. రకరకాల దారులు వెతుక్కుంటూ సొమ్ముచేసుకుంటున్నారు.. కొరియర్లతో గంజాయ్ సరఫరా చేస్తున్న స్మగ్లర్లు.. ప్రైవేట్ సంస్థలు ఎందుకని.. ఏకంగా ప్రభుత్వానికి చెందిన తపాలా శాఖ (ఇండియా పోస్ట్) ను ఎంచుకున్నారు.. ఇండియా పోస్ట్ ద్వారా గంజాయ్ సరఫరా చేస్తున్న ముఠాను తాజాగా పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది.. ఈ ఘటన అండమాన్‌లో వెలుగులోకి వచ్చింది..

అక్రమ మాదకద్రవ్యాల సరఫరాను దిగ్లీపూర్ పోలీసులు విజయవంతంగా అడ్డుకున్నారు. దిగ్లీపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియా పోస్టు ద్వారా సరఫరా చేస్తున్న కిలోగ్రాము పైగా అక్రమ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.. డిగ్లిపూర్‌లోని సుబాష్‌గ్రామ్ పోస్టాఫీసులో డ్రగ్ డెలివరీకి సంబంధించి వచ్చిన సమాచారం మేరకు డానిప్స్ ఎస్‌డిపిఓ డిగ్లీపూర్ అంకేష్ యాదవ్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు.. డిగ్లీపూర్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం వెంటనే సమావేశమైంది. ఈ బృందంలో ఇద్దరు స్వతంత్ర సాక్షులతో పాటు కానిస్టేబుళ్లు నీరజ్ సింగ్, బిజోయ్ సర్కార్, సుసేన్ దాస్, ఆర్‌సి రాథోడ్ ఉన్నారు.. వీరంతా నిందితుడిని పట్టుకోవడానికి ప్లాన్ తో వెళ్లారు..

అనుమానితుడు రాక కోసం ఎదురుచూస్తూ టీమ్.. తెలివిగా పోస్టాఫీసు దగ్గర నిలబడింది.. కొద్దిసేపటి తర్వాత, వ్యక్తి లొకేషన్‌కు చేరుకోవడం కనిపించింది. అనుమానితుడు పార్శిల్‌ను సేకరించిన వెంటనే, పోలీసు బృందం అతనిని అడ్డగించి సోదాలు నిర్వహించింది. దీంతో నిందితుడి వద్ద 1.010 కిలోల గంజాయి లభ్యమైంది. దిగ్లీపూర్ వార్డ్ నెం. 04లోని దుర్గాపూర్ నివాసి ఉత్తమ్ కుమార్ బిస్వాస్ (40)గా గుర్తించారు.

విచారణలో నిందితుడు నేరంలో తన ప్రమేయాన్ని అంగీకరించాడు. అనంతరం, అతడిని అరెస్టు చేసి, అతనిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. SDPO డిగ్లిపూర్ అంకేష్ యాదవ్ పర్యవేక్షణలో ఉత్తర & మధ్య అండమాన్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ గీతాంజలి ఖండేల్‌వాల్ దిశా నిర్దేశంలో ఈ ఆపరేషన్ జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Also read

Related posts

Share via