SGSTV NEWS
CrimeNational

ఆశ్రమ పాఠశాలలో తీవ్ర విషాదం.. ఉరి వేసుకుని ఇద్దరు పదో తరగతి విద్యార్థుల ఆత్మహత్య..!


మహారాష్ట్రలో తీవ్ర విషాద ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. స్కూల్ ఆవరణలోనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పాల్ఘర్‌లోని వాడా తాలూకాలోని అంబిస్టేలోని ఆశ్రమ పాఠశాలలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్లు పదో తరగతి విద్యార్థులు పాఠశాలలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారి మరణాలు పాఠశాల ఆవరణలో తీవ్ర కలకలం రేపాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన తర్వాత, పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు.

మరణించిన విద్యార్థులను దేవిదాస్ పరశురామ్ నవలే, మనోజ్ సీతారామ్ వాద్ గా గుర్తించారు. ఇద్దరూ 10వ తరగతి చదువుతున్నారు. పాఠశాల ఆవరణలో తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఆశ్రమశాల క్యాంపస్ అంతటా, వాడా తాలూకాలో తీవ్ర కలకలం రేపింది. విద్యార్థి ఆత్మహత్య తర్వాత, పోలీసులకు సంఘటన గురించి సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం తరలించి, కేసు నమోదు చేశారు.

ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పాల్ఘర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ వినాయక్ నార్లే, ఎంపీ హేమంత్ సావ్రా, మాజీ జిల్లా కౌన్సిల్ అధ్యక్షుడు ప్రకాష్ నికమ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.స్థానిక ప్రజా ప్రతినిధులు సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంఘటన తీవ్ర రూపం దాల్చడంతో, జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు.

పోలీసులు ఇద్దరు విద్యార్థులపై ఆత్మహత్య కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారని, ఆశ్రమ పాఠశాలలో నివసిస్తున్నారని, చదువుతున్నారని సమాచారం. అయితే, వారి ఆత్మహత్య వెనుక గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ఆత్మహత్యలకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వారు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు

Also read

Related posts