October 16, 2024
SGSTV NEWS
CrimeNational

భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య జంప్.. నెలన్నర కూతురు తల్లికోసం ఏడుపు

భర్త నచ్చలేదు సరే.. కనీసం తన ప్రేగు తెంచుకుని పుట్టిన తన నెలన్నర కుమార్తెపై కనికరం కూడా చూపలేదు ఆ స్త్రీ. తల్లి ప్రేమ కోసం ఏడుస్తున్నా సరే ఆ చిన్నారిని వదిలేసి తన జీవితాన్ని తాను ఎంచుకుంది. ఇప్పుడు ఆ మహిళ భర్త విశాల్ తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. మరోవైపు నెలన్నర వయసున్న కూతురు తల్లి కోసం ఏడుస్తూనే ఉంది. గురువారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. విశాల్ మోగియా అనే యువకుడు తన ఏడాదిన్నర కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి అక్కడికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Also read :Hyderabad: 18 రోజుల పసికందును అమ్మేసిన కసాయి తండ్రి.. 24గంటల్లోనే గుట్టురట్టు..!

భారతీయ సాంప్రదాయంలో వివాహానికి ముఖ్య స్థానం ఉంది. పెళ్లి అనేది హృదయాల కలయిక అని.. ఇందులో రంగు, రూపు ఆస్తులు అంతస్తులు ఎంచరని చెబుతారు. అయితే కొంతమంది మాత్రం ఇందుకు మినహాయింపు.. కేవలం అందాన్ని చూసే పెళ్లి చేసుకునేవారు ఉంటే .. మరికొందరు డబ్బులు, ఆస్తులు అంతస్తులు చూసి పెళ్లి చేసుకునే వారుంటారు. ఇలాంటి వారికి తమ జీవిత భాగస్వామి ఎంత మంచివాడు అయినా ఎంత ప్రేమగా చూస్తున్నా లెక్క ఉండదు. తమ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకుని కుటుంబాన్ని వీధిన పడేస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగుచూసింది. ఇక్కడ ఒక వివాహిత స్త్రీకి తన భర్త నచ్చలేదు.. నల్లగా ఉన్నాడంటూ భర్తను.. నెల చిన్నారిని విడిపెట్టింది. అంతేకాదు తన ప్రియుడితో పారిపోయింది. ఇప్పుడు ఆమె ప్రియుడితో కలిసి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవిస్తోంది.

Also read :కర్నూల్ జిల్లాలో దళిత మహిళను ట్రాక్టర్తో తొక్కించి హత్య చేసిన దారుణసంఘట….

విశాల్ కన్నీరు పెడుతూ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీకి జరిగిన కథంతా చెప్పాడు. ఏడాది క్రితమే తనకు ఓ అమ్మాయితో వివాహమైందని చెప్పాడు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అని.. ఇరు కుటుంబాలు అంగీకారంతోనే తమ వివాహం జరిగిందని.. అయితే పెళ్ళైనప్పటి నుంచి తనతో ఎప్పుడూ భార్య నేరుగా మాట్లాడలేదని వెల్లడించాడు. అంతేకాదు తాను నల్లగా ఉన్నానంటూ ఎప్పుడూ ఏదోకటి అంటూ వెక్కిరిస్తూనే ఉంది. అయినా తన కుటుంబం కోసం భార్యలో ఎప్పటికైనా మార్పు వస్తుందని ఆశాభావంతో ఆమె ఎన్ని అన్నా కూడా పట్టించుకోకుండా ఉన్నట్లు తెలిపాడు. తమకు నెలన్నర క్రితం ఓ అందమైన కూతురు జన్మించిందని పోలీసులకు చెప్పాడు విశాల్.

Also read :ఇదొక రాంగ్ కాల్ ప్రేమ కథా చిత్రం.. పెళ్లైందన్నా వదలని యువతి.. చివరకు..ఒక్క ప్యాకెట్ డెలివరి కోసం బెంగళూరు నుండి హైదరాబాద్ వరకు స్విగ్గి బాయ్ జర్నీ.. తీరా చూస్తే షాక్!

Related posts

Share via