ఆమె ఫిర్యాదు మేరకు ఇంటి యజమాని రామమృతంను ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రామామృతం..రమితపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అదును చూసి రమితపై పెయింట్‌లో కలిపే టిన్నర్ పోసి నిప్పంటించాడని పోలీసులు వెల్లడించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
ఒకే ఇంట్లో కిరాయికి ఉంటున్న రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ ఒక మహిళ ప్రాణం మీదకు వచ్చింది. రోజూ తాగొచ్చి గొడవ చేస్తున్నాడంటూ తమ పక్కనే ఉంటున్న వ్యక్తిపై ఆ ఇంటి ఓనర్కు కంప్లైంట్ చేసింది ఓ మహిళ. దాంతో ఆమె పై కక్ష పెంచుకున్న అతడు దారుణానికి పాల్పడ్డాడు..ఆ మహిళ ఒంటిపై పెయింట్ టిన్నర్ పోసి నిప్పంటించాడు. ఈ షాకింగ్ ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.
కేరళలోని కాసర్గోడ్ జిల్లా మన్నడుక్కంలో ఏప్రిల్ 8న జరిగింది ఈ దారుణ ఘటన. పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. స్థానికంగా నివసించే రమిత అనే మహిళ ఓ కిరాణా దుకాణం నడుపుతోంది. రమిత దుకాణం పక్కనే తమిళనాడుకు చెందిన రామామృతం అనే వ్యక్తి ఫర్నిచర్ దుకాణం నడుపుతున్నాడు. బాధితురాలు రమిత కొన్ని రోజుల క్రితం నిందితుడు రామామృతం మద్యం మత్తులో తనకు ఇబ్బంది కలిగించాడని అతను కిరాయికి ఉంటున్న ఇంటి యజమానికి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఇంటి యజమాని రామమృతంను ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రామామృతం..రమితపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అదును చూసి రమితపై పెయింట్‌లో కలిపే టిన్నర్ పోసి నిప్పంటించాడని పోలీసులు వెల్లడించారు.
తీవ్రగాయాలపాలైన రమితను మంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. 50శాతం గాలిన గాయాలతో రమిత మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు రామామృతం పారిపోయేందుకు ప్రయత్నించడగా స్థానికులు పట్టుకొని పోలీసులు అప్పగించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు …
- Marriages : ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!
- ఇంగ్లీష్ టీచర్ వేధిస్తోంది.. మండుటెండలో కేజీబీవీ విద్యార్థినుల ధర్నా
- తాగుబోతు దాష్టీకం.. తాగి గొడవ చేస్తున్నాడని చెప్పినందుకు మహిళపై దారుణం..
- Kuja Dosha Remedies: జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు ఏమిటంటే