July 7, 2024
SGSTV NEWS
CrimeNational

శ్రీగంధం దొంగిలించేందుకు వచ్చిన దుండగులు.. అటవీ అధికారులకు భలే దొరికిపోయారు..!

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో కాల్పుల మోత కలకలం సృష్టించింది. ముళబాగిలు తాలూకా కాశీపుర అటవీ విభాగంలో శ్రీగంధం చెట్లను నరికేందుకు ఐదుగురు దుండగులు వచ్చారు. ఇది గమనించిన అటవీశాఖ అధికారులు తనిఖీ చేసేందుకు వెళ్లారు. దీంతో చెలరేగిన ఉద్రిక్తతల కారణంగా అటవీ సిబ్బంది కాల్పులు జరిపారు. వారిలో ఒకరికి కాలులోకి తూటా దూరడంతో పోలీసులకు దొరికిపోయాడు. అతన్రని తాయలూరు గ్రామానికి చెందిన భత్యప్పగా గుర్తించారు. మిగిలిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన భత్యప్ప అనే నిందితుడు ఐదుగురు సహచరులతో కలసి కర్ణాటకలోని కర్ణాటకలోని ముళబాగిలు వచ్చినట్లు గుర్తించారు. వారంతా మంగళవారం ఉదయం అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. దొంగలను చూసిన ఫారెస్ట్ గార్డు అనిల్, ఇతర సిబ్బంది తీవ్రంగా హెచ్చరించారు. లొంగిపోకుండా దాడి చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. దీంతో ఒక్కసారిగా అటవీ సిబ్బంది కాల్పులు జరిపారు. తూటా తగలడంతో భత్యప్ప దొరికిపోయాడు. అతన్ని చికిత్స కోసం ముళబాగిలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మిగిలిన దొంగలు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. పరారైన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.
Also read :తాగింది గోరంత.. మిషన్ చూపించేదీ కొండంత”.. లబోదిబోమంటున్న ఆటోవాలా..!read:::
ముళబాగిలు తాలూకా జమ్మనహళ్లి దొడ్డకెరె వద్ద 40 ఎకరాల్లో శ్రీగంధం సాగు చేస్తున్నారు. వేసవిలో చెట్లన్నీ ఎండిపోయాయి. చెరువులోనూ నీరు లేకపోవడంతో కొద్ది రోజులుగా వాటిని నరుక్కుని వెళుతున్న వారి సంఖ్య ఎక్కువైంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ భద్రత కోసం సిబ్బందిని నియమించిందని అధికారులు తెలిపారు

Also read:Missing Mystery: పవన్ కల్యాణ్ చొరవతో.. వీడిన యువతి మిస్సింగ్‌ మిస్టరీ.. విచారణలో బయటపడ్డ విస్తుపోయే వాస్తవాలు!

Related posts

Share via