కర్ణాటకకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆదివారం ఉదయం అనూహ్యంగా అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. కనిపించకుండా పోయిన వ్యాపారిని బీఎం ముంతాజ్ అలీగా గుర్తించారు. సదరు వ్యక్తి మంగళూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెయిదీన్ బవ సోదరుడు కావడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి..
మంగళూరు, అక్టోబర్ 6: కర్ణాటకకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆదివారం ఉదయం అనూహ్యంగా అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. కనిపించకుండా పోయిన వ్యాపారిని బీఎం ముంతాజ్ అలీగా గుర్తించారు. సదరు వ్యక్తి మంగళూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెయిదీన్ బవ సోదరుడు కావడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ముంతాజ్ అలీ ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు తన ఇంటి నుంచి కారులో బయలుదేరి 5 గంటల ప్రాంతంలో కులూరు వంతెన దగ్గర ఆగాడు. అనంతరం అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. కొంత సమయం తర్వాత అతని కుమార్తె స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ముంతాజ్ అలీ డ్రైవింగ్ చేసుకుని వచ్చిన కారు కులూరు వంతెన సమీపంలో నుజ్జునజ్జైన స్థితిలో కనిపించింది. అయితే అక్కడ ముంతాజ్ అలీ ఆనవాళ్లు కనిపించలేదు. బ్రిడ్జ్ వద్ద కారు శిథిలమై కనిపించడంతో అతను బ్రిడ్జిపై నుంచి దూకి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు ముంతాజ్ అలీ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
దీనిపై సమాచారం అందుకున్న మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అనుసమ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ రోజు తెల్లవారుజామున కులూరు వంతెన సమీపంలో వ్యాపారవేత్తకు చెందిన కారు ఉన్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. బీఎండబ్ల్యూ వాహనం బ్రిడ్జి వద్ద కనిపించడంతో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ముంతాజ్ అలీ దానిని అక్కడే వదిలేసి పక్కనే ఉన్న నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సందేహిస్తున్నాం. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తాం. అతను నదిలోకి దూకాగా లేదా మరేదైనా ప్రమాదం జరిగిందా అనేది ఇంకా తెలియరాలేదు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సిబ్బంది, కోస్ట్ గార్డ్‌తో సహా ఇతర ఏజెన్సీల సాయంతో నదిలో వెతుకుతున్నాయని మంగళూరు సీపీ అనుపమ్ అగర్వాల్ తెలిపారు
Also read
- ఇద్దరు ప్రియురాళ్లను తీసుకుని వెళ్లి, దావత్ చేసుకున్న ప్రియుడు.. ఇంతలోనే షాకింగ్ ఘటన..!
- AP News: చోరి సొమ్ము వాటాల పంపిణీలో బెడిసిన యవ్వారం.. గ్యాంగ్ లీడర్ హత్య!
- అతనికి 24.. ఆమెకు 16.. ఇన్స్టాలో కలిశారు.. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలుసా..?
- హైదరాబాద్లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్ఫోర్స్ దాడి..వెలుగులోకి షాకింగ్ నిజాలు! చూశారంటే
- నీచాతి నీచుడు వీడు.. దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..





