సామూహిక అత్యాచారం సమయంలో భయపడిన బాలికలు చాలాసేపు అపస్మారక స్థితిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులు వారిని అదే స్థితిలో వదిలి పారిపోయారు. అక్కడి నుంచి వెళ్లేటప్పుడు, ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే, చంపి భూమిలో పాతిపెడతామని నిందితులు వారిని బెదిరించారు. ఇది అమ్మాయిలను మరింత భయపెట్టింది.
జార్ఖండ్‌లో సభ్య సమాజం తల దించుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని బాలికలపై మైనర్ బాలురే దారుణానికి ఒడిగట్టారు. ఖుంటి జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ 18 మంది అబ్బాయిలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 5 మంది అమ్మాయిలను కిడ్నాప్ చేశారు. ఆపై వారిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ 12 మంది అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలపై సామూహిక అత్యాచారం చేశారు. నిందితుల్లో ఒక బాలుడికి 17 సంవత్సరాలు. మిగిలిన వారు 13 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. ఈ సంఘటనలో బాధితులైన బాలికలు కూడా అదే వయస్సు వారే కావడం విశేషం. ఈ సంఘటన జనవరి 21 రాత్రి ఖుంటి జిల్లాలోని రానియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మొత్తం విషయం బయటపడిన తర్వాత, ఈ నిందితులందరినీ బాలల సంరక్షణ గృహానికి పంపారు. పోలీసుల విచారణ సమయంలో, నిందితులైన బాలురు జరిగిన సంఘటనను పూస గుచ్చినట్లు వివరించారు. ఎవరు ఎవరిపై అత్యాచారం చేశారని పోలీసులు అడిగినప్పుడు, 12 మంది అబ్బాయిలు ఏమాత్రం సంకోచించకుండా ముందుకు వచ్చి, తామే అలా చేశామని ఒప్పుకున్నారు. వారి సమాధానం విని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. నిందితులందరూ ఒకే గ్రామానికి చెందినవారేనని పోలీసులు తెలిపారు.
పోలీసుల విచారణలో, సంఘటన జరిగిన జనవరి 21వ తేదీ సాయంత్రం, ఐదుగురు బాలికలు వివాహ వేడుక నుండి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో 18 మంది అబ్బాయిలు కూడా ఆడుకుని ఇంటికి తిరిగి వెళ్తున్నారు. బాలికలను చూసిన తర్వాత, నిందితుల ఉద్దేశాలు చెడుగా మారాయి. దీంతో బాలికలను బలవంతంగా అపహరించారు. దీని తరువాత, 12 మంది అబ్బాయిలు వారిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. ముగ్గురు బాలికలపై సామూహిక అత్యాచారం చేశారు. మిగిలిన ఆరుగురు బాలురు కాపాలాగా ఉన్నారు. నిఘాలో ఉన్న ఈ అబ్బాయిలు మిగతా ఇద్దరు బాలికలను వేధించారని ఆరోపించారు. జరిగిన తీరునంతా పోలీసులకు వివరించారు నిందితులు. అవసరమైన విచారణ తర్వాత, పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచి, బాలల రక్షణ గృహానికి పంపారు.
సామూహిక అత్యాచారం సమయంలో భయపడిన బాలికలు చాలాసేపు అపస్మారక స్థితిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులు వారిని అదే స్థితిలో వదిలి పారిపోయారు. అక్కడి నుంచి వెళ్లేటప్పుడు, ఈ సంఘటన గురించి ఎవరికైనా చెబితే, చంపి భూమిలో పాతిపెడతామని నిందితులు వారిని బెదిరించారు. ఇది అమ్మాయిలను మరింత భయపెట్టింది. అయితే, నిందితుల క్రూరత్వం నుండి తప్పించుకున్న ఇద్దరు బాలికలు, నిందితులు వెళ్లిన తర్వాత ముగ్గురు బాలికలను ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత విషయం వెలుగులోకి రావడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు
Also Read
- శుక్రవారం గుప్త లక్ష్మిని ఇలా పూజించండి.. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు..
- Blood Moon on Holi: హోలీ రోజున ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ మూన్.. కన్యా రాశిలో ఏర్పడే చంద్ర గ్రహణం
- నేటి జాతకములు…14 మార్చి, 2025
- ఘనంగా ప్రపంచ ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు…
- XXX సోప్స్ అధినేత మృతి