హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలాఉండగా పంచకులలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాయ్‌పూర్ రాణి సమీపంలోని భరౌలీ గ్రామంలో కల్కా సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ చౌదరి కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ప్రదీప్ కాన్వాయ్‌లో ఉన్న అతని మద్దతుదారు గోల్డీ ఖేడీ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన కార్యకర్తలు చికిత్స కోసం PGI ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని ఇంకా గుర్తించలేదు.
ప్రదీప్ చౌదరి కల్కా స్థానం నుండి ప్రస్తుత ఎమ్మెల్యే. ఆయనపై విశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆయనను రంగంలోకి దించింది. ఈ స్థానం నుంచి ఆయనపై పోటీకి శక్తి రాణి శర్మకు బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో, రాయ్‌పూర్ రాణి ప్రాంతంలో క్రికెట్ పోటీని ప్రారంభించేందుకు ప్రదీప్ చౌదరి వచ్చారు. మనక్తబారా గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా, క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం ప్రదీప్ చౌదరి కాన్వాయ్‌తో రాంపూర్ ధాడూ వెళ్తున్నాడు. గోల్డీ ఖేడీ అనే కార్యకర్త అతనితో పాటు మోటార్‌సైకిల్‌పై వెళ్తున్నాడు. ఇంతలో, కొందరు గూండాల కాన్వాయ్‌ను వెంబడించారు. కాన్వాయ్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. మోటర్‌సైకిలిస్ట్ గోల్డీ ఖేడీ ఛాతీపై కాల్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అతన్ని సివిల్ హాస్పిటల్ సెక్టార్ 6లో చేర్చారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్పుల జరిపిన దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.
Also read
- Telangana: తస్మాత్ జాగ్రత్త..ఈ నెంబర్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకండి.. చేశారో.. కొంప కొల్లేరే!
- రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ దారుణ హత్య.. తాళ్లతో బంధించి చిత్ర హింసలు పెట్టి…..
- AP News: ఆయుర్వేదం చాక్లెట్ల పేరుతో ఇవి అమ్ముతున్నారు.. తిన్నారో..
- Andhra Pradesh: ఆమె సాఫ్ట్వేర్.. అతడు ఫుడ్ బిజినెస్.. ఇంతకీ రూమ్‌లో అసలు ఏం జరిగిందంటే..
- Telangana: మోజు తీరిన తరువాత అవౌడ్ చేశాడు.. పాపం ఆ యువతి.. వీడియో