ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఇది జరిగిన వెంటనే, విమానాన్ని రన్‌వేపై అత్యవసరంగా నిలిపివేశారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న భద్రతా సిబ్బంది, ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించారు. అనంతరం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తీరా అసలు విషయం తెలిసి ఉపిరి పీల్చుకున్నారు.
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఇది జరిగిన వెంటనే, విమానాన్ని రన్‌వేపై అత్యవసరంగా నిలిపివేశారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న భద్రతా సిబ్బంది, ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించారు. అనంతరం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తీరా అసలు విషయం తెలిసి ఉపిరి పీల్చుకున్నారు
ఇండిగో విమానం ఢిల్లీలోని T2 టెర్మినల్ నుండి మే 28 మంగళవారం ఉదయం 5:04 గంటలకు బనారస్‌కు బయలుదేరాల్సి ఉంది, అయితే బాంబు గురించి సమాచారం అందుకున్న తరువాత, ప్రయాణీకులను క్షేమంగా ఎమర్జెన్సీ ద్వారం గుండా దించేశారు. తనిఖీ కోసం విమానాన్ని విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేకు తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి బాంబ్ స్క్వాడ్ టీమ్, సీఐఎస్‌ఎఫ్‌ను రప్పించారు. దీని తరువాత, విమానాన్ని పరిశీలించిన అధికారులు ఇది పుకారు అని తేల్చి చెప్పారు. ఇండిగో ఫ్లైట్ లేబొరేటరీలో టిష్యూ పేపర్‌పై బాంబు రాసి ఉన్నట్లు సీఐఎస్‌ఎఫ్ అధికారి తెలిపారు. దీంతో కలకలం రేగడంతో విచారణ చేపట్టగా అలాంటిదేమీ లేదని తేలిందన్నారు.
https://x.com/ANI/status/1795272761402896828?t=04tvsRE2EvXNyy87dBzdZA&s=19
కాగా, ఇండిగో విమానం నుంచి ప్రయాణికులను ఖాళీ చేయిస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఇండిగో ఫ్లైట్‌లోంచి జనాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు వచ్చారు. . విమానం నుంచి ప్రయాణికులు త్వరగా బయట పడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. హడావిడిలో కొంతమంది కిటికీలోంచి కూడా బయటకు దూకేశారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని విమానంలో టాయిలెట్‌లో టిష్యూ పేపర్‌పై రాసిన బాంబు బెదింపు అందరిని ఉరుకులు పరుగులు పెట్టించిందని అధికారులు నిర్ధారించారు. దీనిపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేయగా.. బాంబు ఉందన్న సమాచారం పుకార్లేనని తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు …
- Marriages : ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!
- ఇంగ్లీష్ టీచర్ వేధిస్తోంది.. మండుటెండలో కేజీబీవీ విద్యార్థినుల ధర్నా
- తాగుబోతు దాష్టీకం.. తాగి గొడవ చేస్తున్నాడని చెప్పినందుకు మహిళపై దారుణం..
- Kuja Dosha Remedies: జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు ఏమిటంటే