October 16, 2024
SGSTV NEWS
CrimeNational

అందమైన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ.10వేలు రివార్డు..! చివరకు ఊహించని ట్విస్ట్..

సూపర్.. బంపర్.. అద్భుతమైన జాబ్ ఆఫర్.. ఏం లేదు.. అందమైన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేయడమే.. పెళ్లయి చాలా కాలమైనా సంతానం కలగని మహిళలను గర్భం దాల్చేలా చేస్తే.. రూ.10వేలు రివార్డు ఇస్తాం.. అంటూ అమాయకుల నుంచి డబ్బులు దండుకునేందుకు మోసగాళ్లు మరో కొత్త పంథాలో బరితెగించారు.. ఆన్‌లైన్ మోసం రోజు రోజుకో కొత్త దారి వెతుకుతోంది. మోసానికి కాదేదీ అనర్హం అన్నట్టు.. దుండగులు అన్నీ దారుల్లోనూ దోపిడికి పాల్పడుతున్నారు. తాజాగా.. గర్భవతులను చేయాలంటూ దుండగులు సోషల్ మీడియా వేదికలుగా ఉద్యోగ ప్రకటన ఇచ్చారు. ఇంకేముందు కొందరు అద్భుతమైన ఆఫర్ అంటూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.. ఇంకేముంది. రూ.750 ఫీజుతో మొదలయ్యే దోపిడి.. వేలు.. లక్షల్లో దండుకునే వరకు వెళ్లింది..

ఈ షాకింగ్ సైబర్ క్రైమ్ ఘటన హర్యానాలోని నుహ్ జిల్లాలోని మేవాత్‌లో వెలుగులోకి వచ్చింది.. మహిళలను గర్భవతిని చేస్తామని ప్రకటనలు ఇచ్చి మోసం చేసే ముఠాను సైబర్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ముఠాలోని ఇద్దరు మోసగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ ఈ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.

హర్యానాలోని మేవాత్‌లో దుండగులు KYC, OLX, Tatlu లాంటి దోపిడి తరహాలో విభిన్నమైన ప్రకటన చేశారు. దీంతో కొందరు మోసపోయి.. ఈ ప్రకటనపై ఫిర్యాదు చేశారు.. ఈ ఫిర్యాదును అందుకున్న నూహ్ జిల్లా సైబర్ స్టేషన్ పోలీసులు ఇద్దరు మోసగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ ప్రకటన చూసి పోలీసులే అవాక్కయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు వివిధ రకాల ఉద్యోగాల కోసం చాలా ప్రకటనలు వెలువడ్డాయి.. కానీ.. మొదటి సారిగా, షాకయ్యే ఉద్యోగ ప్రకటనను మేము చూశాము. అసలే మోసగాళ్లు పెళ్లయి చాలా కాలమైనా సంతానం కలగని ఇలాంటి మహిళలను గర్భవతులను చేసేందుకు ఈ ప్రకటన చేశారు. అందమైన మహిళల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మోసగాళ్లు వారిని గర్భవతిని చేసిన వ్యక్తికి రూ.10 వేలు రివార్డు ఇస్తామని ప్రకటించారు.. అంటూ పోలీసులు తెలిపారు..
Also read :Andhra Pradesh: ఆడపిల్లలు పుట్టడమే శాపమా?.. గుండెల్ని పిండేస్తున్న ఘటన.. భర్త చనిపోయిన నెలకే..q

ఇందుకోసం యువత సులువుగా ప్రభావితమై ఉచ్చులో చిక్కుకునేలా మోసగాళ్లు షరతు పెట్టారు. ఈ ప్రకటన చూసి అందులో ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేయగానే సెక్యూరిటీ పేరుతో మోసగాళ్లు రూ.750 డిమాండ్ చేసేవారు. రిజిస్ట్రేషన్ సాకు చూపి మోసగాళ్లు యువతను రకరకాలుగా మోసం చేసి వారి నుంచి లక్షల రూపాయలు దండుకున్నారు. ఇలాంటి ఫిర్యాదును స్వీకరించిన నూహ్ సైబర్ పోలీస్ స్టేషన్ ఇద్దరు మోసగాళ్లను అరెస్టు చేసింది.
Also read :Andhra Pradesh: ఆడపిల్లలు పుట్టడమే శాపమా?.. గుండెల్ని పిండేస్తున్న ఘటన.. భర్త చనిపోయిన నెలకే..

ఈ నిందితులను పాల్వాల్‌లోని హతిన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బురాకా నివాసి ఇజాజ్, నుహ్ జిల్లాలోని పింగవాన్ నివాసి ఇర్షాద్‌గా గుర్తించారు. నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రెండు సిమ్ కార్డులు మహారాష్ట్ర నుంచి, రెండు అసోం చిరునామా నుంచి కొనుగోలు చేశారు. నాలుగుకు పైగా ఫేస్‌బుక్ ఖాతాలను కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలో ఇలాంటి మోసం జరగడం ఇదే మొదటిది. నిందితులు ఏడాది కాలంగా ఇదే తరహాలో నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ప్రజలు వారి బారిన పడ్డారని.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా ఇదే తొలిసారని పోలీసులు తెలిపారు.

Also read :Hyderabad: బరితెగించిన సైబర్ బూచోళ్లు.. మెయిల్‌ హ్యాక్‌ చేసి ఏకంగా రూ.11.4 కోట్లు దోచేశారు!

Related posts

Share via