ఏ కష్టం వచ్చిందో తెలియదుగానీ ఓ జంట తమ ఇద్దరు పిల్లలను చంపి, ఆపై ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా తొలుత ఇద్దరు పిల్లలను చంపారు. అనంతరం భార్యభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. ఇందులో భర్త చనిపోగా భార్య బతికిపోయింది. ఈ దిగ్ర్భాంతికర ఘటన బెంగళూరులోని హోస్కోట్ తాలూకాలోని గోనకనహళ్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బెంగళూరు, సెప్టెంబర్ 14: కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లా హోస్కోట్ తాలూకాలోని గోనకనహళ్లి గ్రామంలో శివు (32), మంజుల అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నేళ్ల క్రితం శివు ఓ ప్రమాదం కారణంగా ఇంటికే పరిమితమయ్యాడు. ఏ ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉండేవాడు. కుటుంబ ఆర్ధిక పరిస్థితులకుతోడు భార్యపై అతడికి అనుమానం కారణంగా తరచూ దంపతుల మధ్య గొడవలు జరిగేవి. దీంతో గత కొంతకాలంగా ఈ జంట సూసైడ్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఇద్దరూ చనిపోతే పిల్లలు అనాథలవుతారని భావించి తొలుత పిల్లలను చంపి, ఆపై తామిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని పథకం చేశారు. శనివారం పథకం అమలు చేయాలని భావించిన శివు, మంజుల.. అదే రోజు మధ్యాహ్నం కలిసి మద్యం సేవించారు.
సాయంత్రం 4 గంటల సమయంలో తొలుత 11 ఏళ్ల కుమార్తె చంద్రకళ గొంతు కోసి చంపారు. ఆ తర్వాత నీళ్లలో తల ముంచి చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం ఏడేళ్ల కుమారుడు ఉదయ్ సూర్యను కూడా అదే విధంగా చంపారు. అనంతరం మంజుల ఉరి వేసుకోవడానికి ప్రయత్నించగా.. అనారోగ్యంతో వాంతి చేసుకున్న భర్త శివు సమీపంలోని షాపు నుంచి ఆహారం కొని తీసుకురావాలని చెప్పాడు. ఆమె తిరిగి వచ్చేసరికి శివు కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక మంజుల కూడా ఆత్మహత్య చేసుకునే ముందు తండ్రితో మాట్లాడాలనుకుంది. ఇంట్లో భర్త ఫోన్ లాక్ ఉండటంతో పొరుగింటి వారి ఫోన్‌లో తండ్రితో మంజుల మాట్లాడింది. ఆమె మాటలు విన్న ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మంజుల ఇంటికి వెళ్లి చూడగా ఆమె పిల్లలు, భర్త శివు మృతి చెంది కనిపించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు పిల్లలు, భర్త మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మంజులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు