July 1, 2024
SGSTV NEWS
CrimeNational

Viral Video: మేనేజర్‌ను లేపేసేందుకు రౌడీలను పురమాయించిన ఉద్యోగులు.. ఎందుకో తెలుసా?

కొన్ని ఆఫీస్‌లలో మేనేజర్లు ఛండశాసనుల్లా ప్రవర్తిస్తుంటారు. ఉద్యోగులను దారుణంగా హింసిస్తుంటారు. వారి సహనాన్ని నానా విధాలుగా పరీక్షిస్తుంటారు. అలా ఓ కంపెనీ మేనేజర్‌ తన కింద ఉద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అందరి ముందు దుర్భాషలాడుతూ చెర్రెత్తించాడు. దీంతో మేనేజర్‌పై పీకల్లోతు పగ పెంచుకున్న ఇద్దరు ఉద్యోగులు.. మేనేజర్‌ను హత్య చేసేందుకు పథకం పన్నారు..

బెంగళూరు, ఏప్రిల్ 7: కొన్ని ఆఫీస్‌లలో మేనేజర్లు ఛండశాసనుల్లా ప్రవర్తిస్తుంటారు. ఉద్యోగులను దారుణంగా హింసిస్తుంటారు. వారి సహనాన్ని నానా విధాలుగా పరీక్షిస్తుంటారు. అలా ఓ కంపెనీ మేనేజర్‌ తన కింద ఉద్యోగుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అందరి ముందు దుర్భాషలాడుతూ చెర్రెత్తించాడు. దీంతో మేనేజర్‌పై పీకల్లోతు పగ పెంచుకున్న ఇద్దరు ఉద్యోగులు.. మేనేజర్‌ను హత్య చేసేందుకు పథకం పన్నారు. అందుకు గూండాలకు సుపారీ ఇచ్చి నడి రోడ్డుపై చితక్కొట్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ వైరల్‌ కావడంతో పథకం పన్నిన వాళ్లు పోలీసులకు దొరికిపోయారు. ఈ విచిత్ర ఘటన ఐటీ రాజధాని బెంగళూరులో జరిగింది. వివరాల్లోకెళ్తే

బెంగళూరులోని ఓ మిల్క్ ప్రొడక్ట్ కంపెనీలో ఉమాశంకర్, వినేష్ అనే ఇద్దరు ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆడిటర్‌గా పని చేస్తున్న సురేష్‌ ఆ ఇద్దరిపై పని ఒత్తిడి పెంచి హింసించాడు. సీనియర్‌ అధికారుల ముందు తమను దూషిస్తూ కించపరిచారు. దీంతో వారు ఆగ్రహంతో రగిలిపోయారు. సురేష్‌పై పగ పెంచుకుని తగిన శాస్తి చేయాలని అనుకున్నారు. చివరికి అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. కొందరు గూండాలను సంప్రదించి, వారికి సుపారీ ముట్టజెప్పి హతమార్చమని పురమాయించారు. మార్చి 31న కళ్యాణ్‌ నగర్‌ సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న సురేష్‌ను గూండాలు అడ్డగించి ఘర్షణకు దిగారు. అనంతరం రాడ్లతో అతడ్ని చితక్కొట్టారు. చనిపోయాడని భావించిన గూండాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రోడ్డుపై ఇతర ప్రయాణికులు సురేష్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు

అదే రోడ్డులో వెళ్తున్న ఒక వాహనంపై అమర్చిన కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డైయ్యాయి. ఈ వీడియో సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అయ్యింది. చాలా మంది ఈ వీడియో క్లిప్‌ను పోలీసులకు షేర్‌ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు వారికి అసలు విషయం తెలిసింది. ఏప్రిల్‌ 5న ఉమాశంకర్‌, వినేష్‌లతోపాటు పురమాయించిన ముగ్గురు రౌడీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Also read

Related posts

Share via