November 21, 2024
SGSTV NEWS
CrimeNationalViral

Viral Video: భవనంలో అగ్నిప్రమాదం.. 19వ ఫ్లోర్‌ నుంచి కిందకి దూకేసిన వ్యక్తి! ఆ తర్వాత ఏం జరిగిందంటే

బెంగళూరు, ఏప్రిల్ 8: ఐటీ రాజధాని నగరం బెంగళూరులో ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి హోటల్‌లోని 19వ అంతస్తు నుంచి కిందకి దూకి మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన సోమవారం (ఏప్రిల్ 8) బెంగళూరులోని నాగరిక పునరుజ్జీవన హోటల్లో చోటు చేసుకుంది. మృతుడిని బెంగళూరుకు చెందిన శరణ్‌ (28)గా గుర్తించారు. వీడియోలో రేస్ కోర్స్ రోడ్‌లోని రినైసన్స్ హోటల్‌లో 19వ అంతస్తులో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అదే ఫ్లోర్‌లో ఉన్న శరణ్‌ బాల్కనీ చుట్టూ తిరుగుతూ వీడియోలో కనిపించాడు. అనంతరం 19వ అంతస్తులోని బాల్కనీ గోడపై కూర్చుని కిందకి దూకడం వీడియోలో కనిపిస్తుంది. అయితే అక్కడ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగిందో.. ఆ వ్యక్తి ఎందుకు కిందకి దూకేశాడు అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ చేపట్టారు. మృతుడు శరణ్‌ 19వ అంతస్తు నుండి దూకడం, ఆపై అతని శరీరం నేలపై పడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా గత ఏడాది బెంగళూరులో సరిగ్గా ఇలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. కోరమంగళ భవనంలోని ఓ పబ్‌లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు, భవనం నాల్గవ అంతస్తు నుంచి ఓ వ్యక్తి కిందికి దూకేశాడు. ఈ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. అయితే అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మంటల నుంచి తనను తాను రక్షించుకోవడానికి నాల్గవ అంతస్తు నుంచి దూకినట్లు అతడు తెలిపాడు. స్వల్పగాయాలతో బయటపడిన ఆతడు చికిత్స అనంతరం కోలుకున్నాడు.



అక్టోబరు 2021లో ముంబైలోని లోయర్ పరేల్‌లోని అవిఘ్న టవర్‌లో మంటలు చెలరేగడంతో మరో వ్యక్తి పైనుంచి కిందకి దూకి మరణించాడు. మంటల నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి భవనంపై నుంచి అమాంతం దూకినట్లు సమాచారం. తాజాగా మరో వ్యక్తి ఇదే రీతిలో అగ్నిప్రమాదం జరిగిన 19వ అంతస్తు నుంచి కిందకి దూకడం కలకం రేపుతోంది.

Also read

Related posts

Share via