November 22, 2024
SGSTV NEWS
CrimeNational

‘ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చాయనీ..’ కత్తితో ఒకళ్లనొకరు పొడుచుకున్న తల్లీకూతుళ్లు

బెంగళూరు, ఏప్రిల్ 30: ఇంటర్‌ ఫలితాల్లో తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని కూమార్తెను ప్రశ్నించడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. క్షణికావేశంలో తల్లి తన కడుపున పుట్టిన కుమార్తెను కత్తితో పొడిచింది. దీంతో కుమార్తె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన బెంగళూరులో సోమవారం (ఏప్రిల్‌ 29) రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బెంగళూరులోని బనశంకరిలోని శాస్త్రి నగర్‌లో నివాసం ఉంటోన్న పద్మజ (60) భర్త రెండేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు కుమార్తె సాహితి (19) ఉంది. సాహితీ ఈ ఏడాది ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయగా.. ఇటీవల ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల్లో సాహితీకి తక్కువ మార్కులు వచ్చాయి. ఇదే విషయమై తల్లి పద్మజ రాత్రి 7:30 గంటల ప్రాంతంలో తక్కువ మార్కులు వచ్చాయేమని సాహితీని ప్రశ్నించింది. చదువును నిర్లక్ష్యం చేస్తుందని సాహితీపై పద్మజ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తల్లికూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహంతో పద్మజ కత్తితో సాహితీపై దాడి చేసి, పొడిచింది. సాహితీ కూడా అదే కత్తిని తీసి తల్లి పద్మజను పొడిచింది. ఇరుగుపొరుగు గమనించి వారిని ఆస్పత్రికి తరలించగా.. సాహితీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. పద్మజ తీవ్ర గాయాలతో ఇంటెన్సివ్‌ కేర్‌లో చికిత్స పొందుతోంది. దీనిపై బనశంకరి పోలీసులు పోలీసులు కేసునమోదు చేసుకుని, పద్మజ కోలుకున్న తర్వాత విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందేమోనన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాధమిక దర్యాప్తు ప్రకారం.. తల్లికూతుళ్లు వాగ్వాదం అనంతరం కత్తితో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో సాహితీ చనిపోగా, ఆమె తల్లి పద్మజ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తదుపరి విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Also read

Related posts

Share via