బెంగళూరులో 26 ఏళ్ల బ్యాడ్మింటన్ కోచ్ సురేష్ బాలాజీ, తన వద్ద శిక్షణ తీసుకుంటున్న మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బయటపడింది. బాలిక అమ్మమ్మ ఫోన్ చెక్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కోచ్ బాలికను తరచుగా తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. పోలీసులు కోచ్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. విచారణలో మరిన్ని బాధితుల వివరాలు బయటపడే అవకాశం ఉంది.
26 ఏళ్ల సురేష్ బాలాజీ అనే బ్యాడ్మింటన్ కోచ్ వద్ద ఓ మైనర్ బాలిక బ్యాడ్మింటన్ నేర్చుకుంటోంది. ఓ వైపు కోచింగ్ సాగుతుండగా సెలవులు రావడంతో ఆ బాలిక వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లింది. అమ్మమ్మ ఫోన్‌తో బ్యాడ్మింటన్ కోచ్‌తో చాటింగ్ చేసేది. ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఉంటుంది, అసలు ఫోన్‌లో ఈ అమ్మాయి ఏం చేస్తుందా అని డౌట్ వచ్చిన వాళ్ల అమ్మమ్మ ఫోన్‌ను పూర్తిగా చెక్ చేసింది. అంతే.. ఆమె గుండె ఆగినంత పనైంది. కోచ్ సురేష్‌తో చేసిన చాటింగ్‌లో బాలిక తన న్యూడ్ పిక్స్‌ను అతనికి పంపినట్లు అమ్మమ్మ గుర్తించింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పి, బాలికను గట్టిగా నిలదియగా.. అసలు దారుణం బయటపడింది. బ్యాడ్మింటన్ నేర్పే పేరుతో.. కోచ్ సురేష్ ఆ బాలికకు మాయమాటలు చెప్పి, ఆమెను లోబర్చుకున్నారు.
తరచూ తన ఇంటికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేసేవాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, మన మధ్య ఉండే బంధాన్ని గోప్యంగా ఉంచాలని కోరేవాడు. దాంతో ఆ బాలిక కూడా అతను చెప్పినట్టు చేసేది. కానీ, అమ్మమ్మ ఫోన్ చెక్ చేయడంతో మొత్తం వ్యవహారం బయటిపడింది. అయితే బాలిక మాత్రం కోచ్ సురేష్‌తో తాను సంబంధం పెట్టుకున్నట్లు తల్లిదండ్రులకు చెప్పడం కోసమెరుపు. ఈ ఘటన బెంగళూరులో హులిమావు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కోచ్ సురేష్ బాలాజీ తమిళనాడుకు చెందిన వ్యక్తి. కాగా బాలిక తల్లిదండ్రులు కోచ్ సురేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భాగంగా నిందితుడి మొబైల్ ఫోన్‌ను తనిఖీ చేయగా, అతను క్రీడా శిక్షణా కేంద్రంలోని అనేక మంది బాలికలను లైంగికంగా వేధించినట్లు తేలింది
Also read
- తెలంగాణ: ఒక ఊరిలో నిత్యపూజలు.. మరో ఊరిలో కల్యాణం, బ్రహ్మోత్సవాలు.. ఈ రాములోరు చాలా స్పెషల్
- స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ ముఠా ఏం చేశారో తెలుసుకుంటే షాక్..!.
- మ్యాట్రిమోనీ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మింది.. తన శీలాన్ని కోల్పోయింది..
- Weekly Horoscope: వారికి అధికార యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- కిడ్నాప్ కేసులో ఆరుగురు అరెస్ట్..కార్లు, సెల్ ఫోన్లు, కత్తులు స్వాధీనం